Kalki 2898AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్.. మరి ‘కల్కి’లో మిగిలిన ఆరుగురు చిరంజీవులు ఎవరు?

ఇప్పటికి అమితాబ్ ని అశ్వత్థామగా చూపించారు. మరి మిగిలిన ఆరుగురు చిరంజీవులుగా ఎవరెవర్ని చూపిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Kalki 2898AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్.. మరి ‘కల్కి’లో మిగిలిన ఆరుగురు చిరంజీవులు ఎవరు?

Amitabh Bachchan as Ashwatthama in Kalki 2898 AD Movie who is other 6 Immortals

Kalki 2898AD 7 Immortals : ప్రభాస్ మెయిన్ లీడ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సాంకేతిక పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ ద్వారా తెలిసిపోతుంది. ఈ సినిమాకు దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి, చాలా మంది స్టార్ కాస్ట్ ని కూడా తీసుకొచ్చారు. ఇక కథ పరంగా కూడా ఈ సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

అయితే గతంలో కల్కి సినిమాలో మన హిందూ పురాణాల ప్రకారం చెప్పిన ఏడుగురు చిరంజీవులు ఉంటారని వార్తలు వచ్చాయి. తాజాగా నిన్న అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) అశ్వత్థామగా ఈ సినిమాలో నటించబోతున్నట్టు అమితాబ్ క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. దీంతో ఏడుగురు చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామ క్యారెక్టర్ కల్కి సినిమా నుంచి రివీల్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగి మిగిలిన ఆరుగురు చిరంజీవులు కూడా ఉండొచ్చు అని ఆసక్తి నెలకొంది.

మన పురాణాల్లో వేద వ్యాసుడు, హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి లను చిరంజీవులు అంటారు. అంటే మరణం లేని వారు అని. ఈ ఏడుగురికి మరణం లేదని, కలియుగం చివరివరకు ఉంటారని, కలియుగం చివర్లో వస్తారని అంటారు. నాగ్ అశ్విన్ కల్కి 2898AD సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవులు పాత్రలని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కల్కి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, రాజమౌళిలు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని టాక్ వచ్చింది. వీళ్ళే ఆ చిరంజీవులు పాత్రలు చేసి సినిమాలో కొద్దిసేపు మెరిపిస్తారని అనుకుంటున్నారు.

Also Read : Amitabh Kalki Glimpse : ఇది గ్రాఫిక్స్ అంటే.. అమితాబ్ పర్ఫెక్ట్ యంగ్ లుక్.. నాగ్ అశ్విన్ ని పొగిడేస్తున్న నెటిజన్లు..

మన పురాణాల ప్రకారం కలియుగాంతం చివర్లో విష్ణుమూర్తి అవతారం కల్కి వస్తుందని అంటారు. అలా ప్రభాస్(Prabhas) ప్రజలని కాపాడటానికి కల్కిగా వస్తాడు. ఇక ఏడుగురు చిరంజీవులు పాత్రలలో రాజమౌళి వేద వ్యాసుడిగా, రానా హనుమంతుడిగా, దుల్కర్ సల్మాన్ పరుశురాముడిగా, నాని విభీషణుడిగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, విజయ్ దేవరకొండ కృపాచార్యునిగా, అసురుల రాజు బలి చక్రవర్తిగా కమల్ హాసన్ కనిపించబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి అమితాబ్ ని అశ్వత్థామగా చూపించారు. మరి మిగిలిన ఆరుగురు చిరంజీవులుగా ఎవరెవర్ని చూపిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క అమితాబ్ క్యారెక్టర్ గ్లింప్స్ తో సినిమాపై అందరికి మరింత ఆసక్తి కలిగించారు.

Also Read : Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ బచ్చన్.. కల్కి నుంచి అమితాబ్ వీడియో వచ్చేసింది..

ఇటీవల ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో కూడా హనుమంతుడు, విభీషణుడుని చూపించి, చివర్లో బలి చక్రవర్తి ఉన్నట్టు హింట్ ఇచ్చి తన సినిమాటిక్ యూనివర్స్ లో ఏడుగురు చిరంజీవులు ఉంటారని కూడా చెప్పాడు.