Satyabhama Title Glimpse
Kajal Aggarwal Satyabhama : టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఒకరు. పెళ్లి తరువాత ఓ పక్క కుటుంబాన్ని మరో పక్క సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. అఖిల్ డేగల దర్శకత్వంలో ఆమె ఓ సినిమాలో నటిస్తోంది. Kajal60 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా జూన్ 19న కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాకు సత్యభామ(Satyabhama) అనే పేరును ఫిక్స్ చేశారు.
Honey Rose : అక్కడ ముద్దు పెట్టేందుకు చాలా పెద్ద రిస్క్ చేసిన హానీ రోజ్
ఈ సినిమాలో కాజల్ పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తోంది. క్రైం థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జైలులో ఉన్న నిందితులను చేతితో కొడుతూ నిజం చెప్పించింది కాజల్. నిందితులను కొడుతున్నప్పుడు చేతికి ఉన్న గాజులు పగిలి రక్తం వస్తుంది. రక్తం వస్తున్న చేతితోనే ఏసీపీగా ఛార్జ్ తీసుకుంటున్నట్లు సంతకం పెట్టింది. గాజులు తీసేసి కొట్టవచ్చు గదా మేడమ్ అని కానిస్టేబుల్ అడుగగా.. పక్కనే ఉన్న ఎస్ఐని చూస్తూ ‘గాజులు లేకుండానే కొట్టాడుగా చెప్పాడా..’ అంటూ ఆమె చెప్పే డైలాగ్ ఈ సినిమాలోని కాజల్ పాత్రలోని ఈగో, ఇంటెన్సిటీని చూపించేలా ఉన్నాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. శశి కిరణ్ తిక్కా సమర్పణలో శ్రీనివాస్ రావు తక్కెళ్లపల్లి, బాబీ తిక్క సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమానే కాకుండా శంకర్- కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఇండియన్ 2’లో , బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘భగవంత్ కేసరి’, బాలీవుడ్‌లో ‘ఉమ’ అనే సినిమాల్లోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.