Kajal Aggarwal: కాబోయే భర్తతో కలిసి ఫస్ట్‌టైమ్!

Kajal Aggarwal – Gautam Kitchlu: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ముంబైకి చెందిన యంగ్ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లును ఈ నెల 30న వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కాజల్ బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కాజల్. ఈ ఫొటో చూసిన కాజల్ ఫ్యాన్స్, నెటిజన్స్ విషెస్ చెబుతూ.. జంట చూడముచ్చటగా ఉందని కంగ్రాట్స్ తెలుపుతూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.