Kalki Bujji : ఆఖరికి ప్రభాస్ ‘బుజ్జి’ని కలుసుకున్న ఆనంద్ మహీంద్ర
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD.

Kalki 2898 AD Anand Mahindra meets Bujji
Kalki Bujji – Anand Mahindra : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో చిత్ర బృందం వేగం పెంచింది. ఈ మూవీలో ఎంతో కీలకమైన బుజ్జి అనే కారును దేశంలోని వివిధ నగరాల్లో తిప్పుతూ మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ కారును ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నడిపారు.
అనంతరం ఆయన బుజ్జితో ఫోటోలు దిగారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. ‘బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్రా’ అనే క్యాప్షన్‌తో వీడియోను పంచుకుంది. కాగా.. కల్కి సినిమా కోసం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ బుజ్జి ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. కారును తయారు చేయడంలో ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలైన మహీంద్రా, జయం మోటార్స్ (కోయంబత్తూరు) ఇంజినీర్లు సహకారం అందించారు.
Pawan kalyan : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్.. సినీ ప్రముఖుల శుభాకాంక్షలు..
#Bujji meets @anandmahindra…#Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/gZETpmPf7e
— Kalki 2898 AD (@Kalki2898AD) June 12, 2024
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో కల్కి మూవీని నిర్మించారు. దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.