Kalki 2898 AD Bujji arrives in Mumbai
Prabhas Kalki 2898 AD Bujji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి నటీనటులు కీలక పాత్రలను పోషించారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్ తో చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ మూవీ కోసం బుజ్జి కారును సొంతంగా తయారు చేశారు. ఈ కారుతోనే అన్ని పట్టణాల్లో మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది.
మొదటగా హైదరాబాద్, ఆ తరువాత చెన్నైలో బుజ్జి సందడి చేయగా ఇప్పుడు ముంబైలో హవా మొదలైంది. ముంబైలోని జుహు బీచ్‌లో అభిమానుల కోసం ఉంచారు. ఈ కారును చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. కారును ఇప్పటికే పలువురు డ్రైవ్ చేయగా ముంబై పోలీసులు కూడా దీన్ని డ్రైవ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 10న విడుదల చేయనున్నారు.
Aamchi Mumbai’s real superhero also wants to drive our Bujji ?
Heartwarming visuals from Juhu Beach, Mumbai ? ❤️#Kalki2898AD @BelikeBujji @MumbaiPolice pic.twitter.com/6ioxpvrWWr— Kalki 2898 AD (@Kalki2898AD) June 7, 2024