Telugu Film Chamber : రామోజీరావు మృతికి టాలీవుడ్‌ నివాళి.. రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం

సినిమా షూటింగ్‌ల‌ను నిలిపివేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

Telugu Film Chamber : రామోజీరావు మృతికి టాలీవుడ్‌ నివాళి.. రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం

Film Chamber decision tomorrow holiday for telugu cinema shooting

Updated On : June 8, 2024 / 12:25 PM IST

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చికిత్స పొందుతూ శ‌నివారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ సంతాపం వ్య‌క్తం చేసింది. సంతాప సూచిక‌గా రేపు (ఆదివారం జూన్ 9న‌) సినిమా షూటింగ్‌ల‌ను నిలిపివేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. రేపు షూటింగ్ లకు సెలవు అన్నారు.

రామోజీరావు పార్థీవ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానులు, సినీ ప్ర‌ముఖుల సంద‌ర్శ‌నార్థం ఉంచారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత, సినీ ప్రముఖులు రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్రప్రసాద్‌, ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ తదితరులు నివాళులర్పించారు.

Ramoji rao : అతిథి పాత్ర‌లో న‌టించిన రామోజీరావు.. ఏ మూవీనో తెలుసా..?

రామోజీరావు అంత్య‌క్రియ‌ల‌ను అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఆదేశాల‌ను జారీ చేసింది. ఆదివారం రామోజీ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.