×
Ad

Bigg Boss 9 Telugu: అప్పుడు కిసాన్.. ఇప్పుడు జవాన్.. చరిత్ర సృష్టించిన కామనర్స్..

బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) విన్నర్ గా నిలిచిన ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల.

kalyan padala and pallavi prashanth two commoners won bigg boss title

Bigg Boss 9 Telugu: 15 వారలా ఉత్కంఠకు తెర లేచింది. బిగ్ బాస్ సీజన్ 9కి ఎండ్ కార్డు పడింది. ఎట్టకేలకు ఒక కామనర్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) విన్నర్ గా నిలిచాడు. అతనే కళ్యాణ్ పడాల. 15 వారాల ముందు వరకు ఈ పేరు ఎవరికి తెలియకపోవచ్చు కానీ, ఇప్పుడు ఈ పేరు ఒక సెన్సేషన్ గా మారింది. కామనర్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసి కప్పు గెలిచి సత్తా చాటాడు కళ్యాణ్ పడాల. దీంతో, అతని పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రెండ్ అవుతోంది. అయితే, ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఓటీటీతో కలిపితే 10.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. హిస్టరీ క్రియేట్ చేసిన కామనర్.. ఫ్యాన్స్ సంబరాలు

కానీ, ఇద్దరు కామనర్స్ మాత్రం చరిత్ర సృషించారు. అందులో ఒకరు కళ్యాణ్ పడాల కాగా రెండవది పల్లవి ప్రశాంత్. ఈ ఇద్దరిలో ఒకరు జవాన్ కాగా మరొకరు కిసాన్ అవడం విశేషం. కళ్యాణ్ పడాల ఒక ఆర్మీ మ్యాన్. ఆయన ఒక సీఆర్ఫీఎఫ్ జవాన్. కానీ, లీవ్ తీసుకొని మరీ ఆయన బిగ్ బాస్ కోసం వచ్చాడు. దాంతో, దేశ సేవలో భాగమైన కళ్యాణ్ పడాలకు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ఇక నాగార్జున సైతం రెండు సార్లు కళ్యాణ్ కి జవాన్ సెల్యూట్ చేయడం మనం చూశాం కూడా. ఇది కూడా కళ్యాణ్ పాజిటీవ్ గా మారింది. అయినప్పటికీ, తన మాటతో, ఆటతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు కళ్యాణ్ పడాల.

ఇక బిగ్ బాస్ సీజన్ 7లో కూడా సరిగ్గా ఇలాంటిదే జరిగింది అనే చెప్పాలి. రైతు బిడ్డగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అతనికి కూడా రైతు అనేసరికి ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ ఏర్పడింది. అయినప్పటికీ తన ఆటతో అందరి మనసులు గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్. కామన్ గా భారతీయులు అందరూ తరచుగా చెప్పే మాట జై జవాన్, జై కిసాన్ అని. అలాంటిది ఆ ఇద్దరు ఇపుడు ఇలా బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.