Kalyan ram doing his next movie with pushpa movie writer srikanth vissaKalyan ram doing his next movie with pushpa movie writer srikanth vissa
Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కాస్త వెనుకపడిపోయాడు. ఈమధ్య ఆయన చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. రీసెంట్ గా ఆయన చేసిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మదర్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత ఇప్పటివరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు కళ్యాణ్ రామ్.
కానీ, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయన నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. అప్పుడెప్పుడో బింబిసార 2ని అధికారికంగా ప్రకటించాడు. కానీ, అది ఎక్కడివరకు వచ్చింది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ నేపధ్యంలోనే చాలా గ్యాప్ తరువాత తన నెక్స్ట్ సినిమా కోసం లైన్ క్లియర్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్(Kalyan Ram). అందుకోసం పుష్ప మూవీ టీం మెంబర్ ని పట్టేశాడట.
ఆ పర్సన్ మరెవరో కాదు రచయిత శ్రీకాంత్ విస్సా. రచయితగా టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీకాంత్ కి మంచి డిమాండ్ ఉంది. పుష్ప 1 అండ్ 2, టైగర్ నాగేశ్వర రావు, డెవిల్, 18 పేజెస్, అల్లుడు అదుర్స్, వెంకీ మామ లాంటి చాలా సినిమాలకు ఆయన రైటర్ గా వర్క్ చేశాడు. ఇక కళ్యాణ్ రామ్ గత చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు కూడా శ్రీకాంత్ విస్సా రచయితగా పని చేశాడు. ఈ సినిమాలో కీలకమైన క్లిమక్స్ ఎపిసోడ్ ను సెట్ చేసింది కూడా శ్రీకాంత్ విస్సానే.
అలా, శీకాంత్ విస్సా వర్క్ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చిందట. అందుకే, అతడిని దర్శకుడిగా చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగానే ఇటీవల శ్రీకాంత్ చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చిందట. వెంటనే ఆ సినిమాకు ఒకే చెప్పేశాడట. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్. రా అండ్ రస్టిక్ కథాంశంతో ఈ సినిమా రానుంది అని తెలుస్తోంది. అతి త్వరగా సినిమాను కంప్లీట్ చేసి 2026 ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట కళ్యాణ్ రామ్. మరి కళ్యాణ్ రామ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీకాంత్ విస్సా నెరవేరుస్తాడా అనేది చూడాలి.