Kama and The Digital Sutras : ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’ రిలీజ్ కి రెడీ.. ఇంట్లో మృగాళ్లను శిక్షించలేకపోతున్నాం..
తాజాగా ఈ సినిమా ఈవెంట్ నిర్వహించారు. (Kama and The Digital Sutras)
Kama and The Digital Sutras : వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు.. పలువురు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’. సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ నిర్వహించారు.
దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ.. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ చేసి గతంలో బంగారు పాదం అనే సినిమా తీసాను. కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ తో వస్తున్నాను ఇప్పుడు. మా సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ గా చేసాము సినిమాని. మా సినిమాని పొయెటిక్ గా తెరకెక్కించాము. మా సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా మంచి సినిమా చేశారు, క్వాలిటీ మూవీ చేశారనే పేరు మాత్రం వస్తుంది అన్నారు.
Also Read : Balakrishna : నిరాశలో తెలంగాణ బాలయ్య బాబు ఫ్యాన్స్.. ఆంధ్ర ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ..
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. మనం బయట సమాజంలోని మృగాళ్లను శిక్షిస్తున్నాం. కానీ మన ఇంట్లో మృగాళ్లను శిక్షించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ఈ కథాంశంతోనే మంచి సందేశం, వినోదం ఉండేలా ఈ సినిమాని తెరకెక్కించారు. మా శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

