Balakrishna : నిరాశలో తెలంగాణ బాలయ్య బాబు ఫ్యాన్స్.. ఆంధ్ర ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ..

ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా బాలయ్య బాబు తాండవం చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. (Balakrishna)

Balakrishna : నిరాశలో తెలంగాణ బాలయ్య బాబు ఫ్యాన్స్.. ఆంధ్ర ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ..

Balakrishna

Updated On : December 4, 2025 / 3:19 PM IST

Balakrishna : బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అఖండ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం అంటూ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించారు. అఖండ 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అయితే నేడు డిసెంబర్ 4నే రాత్రి ప్రీమియర్స్ కూడా వేస్తామని ప్రకటించారు.(Balakrishna)

ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా బాలయ్య బాబు తాండవం చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ అమెరికాలో, ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ ఓపెన్ అయి హౌస్ ఫుల్స్ కూడా అయిపోతున్నాయి. నేడు రాత్రికే ఫ్యాన్స్ అఖండ 2 సినిమా చూడటానికి రెడీ అయిపోయారు. ఈ విషయంలో తెలంగాణ ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు.

Also Read : Samantha : పెళ్ళికి ముందు.. రాజ్ కి గోరింటాకు చూపిస్తూ మురిసిపోతున్న సమంత .. ఫొటోలు వైరల్..

తెలంగాణలో ఇంకా ప్రీమియర్స్ ప్రకటించలేదు. అంతే కాకుండా ప్రీమియర్స్ కే కాదు, రేపట్నుంచి కూడా టికెట్ బుకింగ్స్ ఆన్లైన్ లో ఇంకా ఓపెన్ చేయలేదు. తెలంగాణలో అఖండ 2 సినిమా ప్రీమియర్స్ కి ఇంకా ప్రమిషన్స్ రాలేదట. పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రీమియర్స్, టికెట్ రేట్స్ హైక్ తెలంగాణలో కష్టంగానే మారింది. ఇటీవలే జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో టికెట్ హైక్స్, ప్రీమియర్స్ పర్మిషన్ ఇస్తే అందులో వచ్చే దాంట్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని సీఎం రేవంత్ కూడా అన్నారు.

ఈ ప్రకటన చేసిన తర్వాత రిలీజయిన మొదటి పెద్ద సినిమా, ప్రీమియర్స్ అడిగిన సినిమా అఖండ 2. దీంతో అఖండ 2 సినిమాకు టికెట్ హైక్స్, ప్రీమియర్స్ ప్రమిషన్స్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎలా ఇవ్వాలి అని చర్చలు జరుపుతున్నట్టు టాలీవుడ్ టాక్. అన్ని చోట్లా ప్రీమియర్స్ వేసి తెలంగాణలో వేయకపోతే కలెక్షన్స్ దెబ్బ తింటాయి, అంతే కాకుండా ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి వీటిపై నిర్మాణ సంస్థ కానీ బోయపాటి కానీ స్పందిస్తారేమో చూడాలి. అటు ఆంద్రలో మాత్రం టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇచ్చారు, ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. ప్రీమియర్ షోలు అన్ని హౌస్ ఫుల్ కూడా అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు.

Also Read : Manchu Lakshmi : ఇంట్లో పెద్ద గొడవ.. విష్ణు స్కూల్ నుంచి నా కూతుర్ని తీసేసాను..