Rajini-Kamal: హీరోకి కథ నచ్చలేదు.. వారం రోజులకే సద్దేశారు.. కమల్ షాకింగ్ కామెంట్స్

సూపర్ స్టార్ రజనీకాంత్-లోకనాయకుడు కమల్ హాసన్.. ఈ కాంబోలో సినిమా(Rajini-Kamal) కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో త్వరలో మేము ఇద్దరమూ కలిసి సినిమా చేస్తున్నాం అంతో చెప్పుకొచ్చాడు కమల్ హాసన్.

Rajini-Kamal: హీరోకి కథ నచ్చలేదు.. వారం రోజులకే సద్దేశారు.. కమల్ షాకింగ్ కామెంట్స్

Kamal Haasan gives clarity on Rajinikanth 173 movie

Updated On : November 16, 2025 / 8:18 PM IST

Rajini-Kamal: సూపర్ స్టార్ రజనీకాంత్-లోకనాయకుడు కమల్ హాసన్.. ఈ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా (Rajini-Kamal)కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో త్వరలో మేము ఇద్దరమూ కలిసి సినిమా చేస్తున్నాం అంతో చెప్పుకొచ్చాడు కమల్ హాసన్. దీంతో, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ మల్టీ స్టారర్ మూవీ రాబోతుందో అని, ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయం అని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ, చాలా కాలం గడుస్తున్నా ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో, ఈ సినిమా రావడం కష్టమే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే, అనుకోకుండా ఈ కాంబోలో సినిమా రానుంది అంటూ అధికారిక ప్రకటన చేశాడు కమల్ హాసన్.

Mrunal Thakur: స్లీవ్ లెస్ టాప్ లో టాప్ లేపుతున్న మృణాల్.. ఫొటోలు

కానీ, ఈ ఇద్దరు హీరోలుగా కాదు. రజనీకాంత్ కాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా ఒక సినిమాను అధికారికంగా ప్రకటించాడు. భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తాడని కూడా మేకర్స్ ప్రకటించారు. అంతా ఒకే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అని అనుకున్నారు అంతా. కానీ, ఎం జరిగిందో ఏమో తెలియదు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో నోట్ విడుదల చేశాడు దర్శకుడు సుందర్ సి. అలా ఈ క్రేజీ కాంబోలో రానున్న ఈ సినిమా ఆగిపోయింది. ఇక అప్పటినుంచి దర్శకుడు ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ అలాగే ఉండిపోయింది.

తాజాగా ఈ విషయంపై మీడియా ముందు క్లారిటీ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ..”ఈ ప్రాజెక్టు గురించి నేను చెప్పడానికి ఏమి లేదు. నేను నిర్మాతను మాత్రమే. నా హీరోకి కథ నచ్చలేదు. ఆయనకు నచ్చే వరకు కథను తీసుకురావడం నా బాధ్యత. ఇక మేము ఇద్దరం కలిసి చేయబోయే సినిమా కోసం డైరెక్టర్ ను వెతుకుతున్నాము” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కమల్ హాసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.