Kamal Haasan thug life streaming on netflix
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం థగ్ లైఫ్. శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఈ చిత్రం కర్ణాటకలో ఇంకా విడుదల కాలేదు.
అయినప్పటికి ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ పాటు కన్నడలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్‌ప్లిక్స్ తెలియజేసింది.
Coolie Vs War 2 : 50కోట్లు వర్సెస్ 80 కోట్లు.. రజినీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్..
కొన్ని చిత్రాలు థియేటర్లలో అలరించలేకపోయినప్పటికి కూడా ఓటీటీలో సత్తా చాటినవి ఉన్నాయి. మరి థగ్ లైప్ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాల్సిందే.