Coolie Vs War 2 : 50కోట్లు వర్సెస్ 80 కోట్లు.. రజినీకాంత్ వర్సెస్ ఎన్టీఆర్..
50కోట్లు, 80 కోట్లు తెలుగు సినిమాల మినిమం బడ్జెట్.

Coolie Vs War 2
Coolie Vs War 2 : కూలీ, వార్ 2 సినిమాల మీద అందరిలో ఇంట్రస్ట్ ఉంది. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాల పవర్ ప్యాక్డ్ యాక్షన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అందుకే తెలుగు రైట్స్ రికార్డ్ రేట్ కి కొనుక్కున్నారు మనవాళ్లు.
ఏదో 10, 20 కాదు ఏకంగా వార్ 2 తెలుగు రైట్స్ 80కోట్ల రికార్డ్ రేట్ కి దక్కించుకున్నారు సితార ప్రొడక్షన్స్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్మురేపుతోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన టీజర్ తో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. వార్ 2 ఇప్పుడు రైట్స్ విషయంలో కూడా అంతే హైప్ తెచ్చేసింది. నాన్ తెలుగు సినిమా, అది కూడా హిందీ సినిమాకి ఏకంగా 80 కోట్లు పెట్టడంతో సర్ ప్రైజ్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమా కాబట్టే అంత హైప్ తెస్తున్నారని తెలుస్తుంది.
Also Read : Kolla : ‘కొల్ల’ మూవీ రివ్యూ.. ఇద్దరు అమ్మాయిలు కలిసి భలే మోసం చేశారే..
రజనీకాంత్ కూలీ సినిమాని కూడా దాదాపు 50 కోట్లతో రైట్స్ కొనుక్కోవడంతో షాక్ అయ్యారంతా. రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో నాగార్జున, ఉపేంద్ర లాంటి ఇంట్రస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో 50 కోట్లకు కొన్నారంటే ఆశ్చర్యపోతున్నారు. రజనీ క్రేజ్, లోకేశ్ యాక్షన్ మేకింగ్, కింగ్ నాగార్జున స్టైల్ కి ఫిదా అయిన టాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
50కోట్లు, 80 కోట్లు తెలుగు సినిమాల మినిమం బడ్జెట్. కానీ ఇప్పుడా రేట్ కి నాన్ తెలుగు సినిమాల రైట్స్ పోటీపడి మరీ దక్కించుకున్నారంటే ఆశ్చర్యపోతున్నారు టాలీవుడ్ జనం. ఆ సినిమాలకు, ఆ హీరోలకు ఉన్న హైప్ తో అంత రేటు పలికాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఆగస్టు 14 న రిలీజవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పోటీ పడి మరి తెలుగులో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాయో చూడాలి.