Niharika : లేడీ డైరెక్టర్ తో నిహారిక సినిమా.. నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ఓపెనింగ్.. హిట్స్ తో ఫామ్ లో ఉన్న హీరో – హీరోయిన్ జంటగా..

తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలను అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు.

Niharika : లేడీ డైరెక్టర్ తో నిహారిక సినిమా.. నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ఓపెనింగ్.. హిట్స్ తో ఫామ్ లో ఉన్న హీరో – హీరోయిన్ జంటగా..

Niharika

Updated On : July 2, 2025 / 7:23 PM IST

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమాని మొదలుపెట్టింది. లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలను అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు.

ఈ సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట గెస్టులుగా హాజరయ్యారు. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ – ఆయ్ ఫేమ్ హీరోయిన్ నయన్ సారిక లపై నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్ లో మొదలు అవ్వనుంది.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా? OG నటుడితో వాయిస్ ఓవర్.. పవన్ రాసిన డైలాగ్స్..

ఫాంటసీ, కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు పెద్ద హిట్ అవ్వడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకుంది. ఇప్పుడు రెండో సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Niharika Konidela New Movie Opening with Sangeeth Sobhan and Nayan Sarika as Pair

Also Read : Sirish : మరోసారి రామ్ చరణ్ వివాదంలో క్షమాపణలు చెప్తూ క్లారిటీ ఇచ్చిన శిరీష్.. అలాంటిది జన్మలో ఎప్పుడూ చేయను..