Niharika
Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమాని మొదలుపెట్టింది. లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలను అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు.
ఈ సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట గెస్టులుగా హాజరయ్యారు. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ – ఆయ్ ఫేమ్ హీరోయిన్ నయన్ సారిక లపై నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్ లో మొదలు అవ్వనుంది.
ఫాంటసీ, కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు పెద్ద హిట్ అవ్వడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకుంది. ఇప్పుడు రెండో సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.