Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. పారితోషికం అన్ని కోట్లా..?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే (Project K). నాగ్ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. పారితోషికం అన్ని కోట్లా..?

Kamal Haasan Plays a key role in Project K

Updated On : June 25, 2023 / 4:10 PM IST

Kamal Haasan Remuneration : రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే (Project K). నాగ్ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే(Deepika Padukone), అమితాబ్ బచ్చ‌న్‌(Amitabh Bachchan), దిశా పఠాని (Disha Patani) లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక తాజాగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan) కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని చిత్ర బృందం తెలియ‌జేసింది.

కాగా.. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ ఎలాంటి షేడ్‌ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న ఈ సినిమా కోసం ఎన్ని రోజులు కాల్ షీట్ కేటాయించారు. ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నారనే దానికి సంబంధించిన వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ వార్త‌ల సారాంశం ప్ర‌కారం ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ విల‌న్ రోల్‌లో న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Prabhas : నా డ్రీమ్ నెరవేరబోతోంది.. ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్‌తో నటించడంపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..

ఈ చిత్రం కోసం ఆగ‌స్టులో 20 రోజులు క‌మ‌ల్ హాస‌న్ కేటాయించార‌ట‌. దీంతో క‌మ‌ల్‌కు సంబంధించిన మొత్తం షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేసేలా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఇప్ప‌టికే ప్లాన్ చేశార‌ట‌. ఇక ఈ సినిమా కోసం లోక‌నాయ‌కుడు సుమారు రూ.100 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందులో ఎంత నిజం ఉంద‌న్న విష‌యం ప్ర‌స్తుతానికి అయితే తెలియ‌రాలేదు. కాగా.. ప్రాజెక్ట్ కే సినిమా 12 జ‌న‌వ‌రి 2024న సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. అధికారిక ప్రకటనతో అదిరిపోయే అప్డేట్..

ఇదిలా ఉంటే.. ‘విక్రమ్’ చిత్రంతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న క‌మ‌ల్ హాస‌న్ వ‌రుస సినిమాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘భార‌తీయుడు 2’ సినిమాలో న‌టిస్తున్నాడు. ‘భార‌తీయుడు’కి సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర‌ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా త‌రువాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు.