Bigg Boss 4 Tamil: కన్ఫెషన్ రూమ్ చూశారా.. ఎలా ఉందో!..

  • Published By: sekhar ,Published On : October 4, 2020 / 07:22 PM IST
Bigg Boss 4 Tamil: కన్ఫెషన్ రూమ్ చూశారా.. ఎలా ఉందో!..

Updated On : October 4, 2020 / 7:35 PM IST

Bigg Boss 4 Tamil: తెలుగు బుల్లితెరపై కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌‌ సీజన్‌ 4 విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే తమిళ్‌లో యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్ ఆధ్వర్యంలో మొదలవ్వాల్సిన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.


అన్ని విఘ్నాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఆదివారం అక్టోబర్‌ 4న ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ షోపై ఇంట్రెస్ట్ కలిగించేందుకు షోకి సంబంధించిన కొన్ని విశేషాలతో ఓ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Kamal Haasan

ఈ టీజర్‌ చూసిన వారందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నది ఏమిటంటే.. Bigg Boss Confession Room. ఈ రూమ్‌పై ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న డిస్కషన్ నడుస్తుందంటే.. ఏ రేంజ్‌లో ఈ రూమ్‌ని ఆర్ట్ డైరెక్టర్‌ డిజైన్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.


స్పూకీ కాన్సెఫ్ట్‌తో ఈ Bigg Boss Confession Room ని డిజైన్‌ చేశారు. ఈ ఒక్కటే కాదు.. బిగ్‌బాస్‌‌లోని ప్రతీది ఈసారి చాలా కొత్తగా ఉంటుందని, అంతా ఆశ్చర్యపోతారని బిగ్‌బాస్‌‌ తమిళ యూనిట్‌ తెలుపుతోంది.. కమల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 4 విజయ్ టీవీలో ప్రసారమవుతోంది..