#HathrasHorror: నిందితులను ‘దిశ’ తరహాలో శిక్షించాలి..

  • Published By: sekhar ,Published On : September 30, 2020 / 09:03 PM IST
#HathrasHorror: నిందితులను ‘దిశ’ తరహాలో శిక్షించాలి..

Updated On : September 30, 2020 / 9:52 PM IST

Kanagana #HathrasHorror: నానాటికీ మానవత్వం మంటగలుస్తోంది.. మృగాళ్లు రెచ్చిపోతున్నారు.. హత్రాస్ అత్యాచార బాధితురాలి మృతి దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేకెత్తిస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ పట్టణానికి చెందిన 20 ఏళ్ల ఎస్సీ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి ఆపై ఆమె నాలుక కోసి హింసించారు. ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది.

ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా స్పందించారు. హైదరాబాద్‌లో దిశ హంతకులకు విధించిన శిక్షనే వీరికీ విధించాలని ట్వీట్ చేశారామె.

‘యోగి ఆదిత్యానాథ్ గారూ.. మీపై నాకు చాలా నమ్మకముంది. దిశ హంతకులకు ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్షనే వీళ్లకీ విధించాలి’ అంటూ #HathrasHorror #HathrasHorrorShocksIndia అనే హ్యాష్ ట్యాగ్లతో ట్వీట్ చేశారు. కంగన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.