Kangana Ranaut : నా ప్రశ్నలకు సమాధానమిస్తే.. ‘పద్మ శ్రీ’ తిరిగి ఇచ్చేస్తా: కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. ఫైర్ బ్రాండ్ బ్యూటీ.. పద్మశ్రీ అందుకున్న ఈ భామ.. ఇండియాకు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో కాదని కామెంట్ చేసింది.

Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. ఫైర్ బ్రాండ్ బ్యూటీ.. ఇటీవలే పద్మశ్రీ కూడా అందుకున్న ఈ భామ. ఇండియాకు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో కాదని వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు పాలైంది. ఇప్పుడు తన వ్యాఖ్యలను కంగనా సమర్థించుకుంది. తాను చెప్పింది తప్పుని నిరూపిస్తే.. తనకు ఇచ్చిన పద్మశ్రీ కూడా వెనక్కి ఇచ్చేస్తానని కంగనా స్పష్టం చేసింది. సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్‌జీ వంటి మహానుభావుల త్యాగాలతో 1857 మొదటి సామూహిక స్వాతంత్ర్య పోరాటం అప్పుడే ప్రతిదీ స్పష్టంగా చెప్పాను. 1857 స్వాతంత్ర్య ఉద్యమం గురించి నాకు అవగాహన ఉంది.

కానీ 1947లో ఎలాంటి యుద్ధం జరిగిందో తనకు తెలియదని చెప్పింది. దీనికి ఎవరైనా సమాధానం చెప్పకలిగితే.. వెంటనే తన పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తానని తెలిపింది. అలాగే క్షమాపణలు కూడా తెలియజేస్తానని కంగనా పేర్కొంది. ఈ విషయంలో ఎవరైనా నాకు సాయం చేయండి ప్లీజ్ అంటూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమర్థించుకుంది. ‘నేను అమరవీరురాలు ‘రాణి లక్ష్మీ బాయి’ మూవీకి పనిచేశాను. 1857 మొదటి స్వాతంత్ర్య పోరాటంపై విస్తృతంగా రీసెర్చ్ చేశా… ఆ సమయంలో జాతీయవాదం పెరిగింది.

ఆమె ఆకస్మిక మరణం ఎందుకు జరిగింది?.. గాంధీజీ, భగత్ సింగ్‌ను ఎందుకు కాపాడలేదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎందుకు చనిపోయాడు.. గాంధీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు?.. బ్రిటీషర్లు విభజన రేఖను ఎందుకు గీసారు?.. స్వాతంత్య్రాన్ని వేడుకగా జరుపుకోవాల్సింది పోయి భారతీయులంతా ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు?..వీటిన్నింటికి నాకు సమాధానాలు కావాలి. దయచేసి నాకు హెల్ప్ చేయండి’ అంటూ కంగనా పేర్కొంది. తాను అడిగిన ప్రశ్నలంటికి జవాబు చెబితే తక్షణమే కేంద్రం ఇచ్చిన పద్మశ్రీ గౌరవాన్ని తిరిగి ఇచ్చేస్తానని కంగనా స్పష్టం చేసింది.
Read Also : Delhi :ఢిల్లీలో T.పీసీసీ నేతల వార్..!ఇదే కొనసాగితే..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

ట్రెండింగ్ వార్తలు