Delhi :ఢిల్లీలో T.పీసీసీ నేతల వార్..!ఇదే కొనసాగితే..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీలో T.పీసీసీ నేతల మధ్య మరోసారి వార్ వాతావరణం బయటపడింది.రివ్వ్యూ మీటింగ్ లో తెలంగాణ పీసీసీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.

Delhi :ఢిల్లీలో T.పీసీసీ నేతల వార్..!ఇదే కొనసాగితే..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

Huzuzrabad By Poll Aicc Review Meeting In Delhi

huzuzrabad by poll AICC Review meeting In Delhi : ఢిల్లీలో తెలంగాణ పీసీసీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోవటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో విభేధాలు మరోసారి బైటపడ్డాయి. హుజూరాబాద్ బై పోల్ ఫలితం పైన ఏఐసీసీ నేత వేణు గోపాల్ పోస్టు మార్టం నిర్వహించారు. అందరిని సమావేశ పరిచి పరిస్థితి గురించి చర్చించారు. ఈచర్చలో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారలేదు. సమావేశంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు..మీది తప్పంటే మీది తప్పు అంటూ విమర్శలు చేసుకున్నారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నేతల మధ్య సమన్వయ లేదని అందుకే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమికి కారణమని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కజిన్ సోదరుడు కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం విరుచుకుపడ్డారు. తెలంగాణలో పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవటం ఖాయం అని అన్నారు పొన్నం. ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఇలా అయిపోవటం ఆవేదన కలిగిస్తోందని తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు.

Read more : Quit Jobs : అమెరికాలో రాజీనామాల సంక్షోభం.. ఒక్క నెలలోనే 44 లక్షల మంది ఉద్యోగులు రిజైన్

నేను కొత్తగా పిసిసి అధ్యక్ష పదవి చేపట్టా..అందరిని అడిగే ఉప ఎన్నికలపై ముందుకు వెళ్ళానన్న రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పొన్నం చేస్తున్న విమర్శలు భరించలేని కొందరు నాయకులు అడ్డుతగిలారు. దీంతో నేను ఎంతోకాలం నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాను. నేను వాస్తవాలు మాట్లాడుతున్నారు. మీకు అంత దమ్ముంటే నన్ను పంపించగలరా?నన్ను సస్పెండ్‌చేయగలరా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తు సవాల్‌ విసిరారు. హుజురాబాద్ మీదే కాకుండా నాగార్జునసాగర్, హుజూర్ నగర్, దుబ్బాక ఓటమిపై కూడా సమీక్షలు నిర్వ హించాలని పొన్నం ప్రభాకర్‌ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ పార్టీలో ఉండి కొందరు టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారని అన్నారు. అటువంటివారిపై ఎందుకు చర్యలు తీసుకోరు అని ప్రశ్నించారు.

దీనికి ఉత్తమ్ కౌంటర్ ఇస్తు..కౌశిక్ రెడ్డి పార్టీ వీడిన తరువాత నాలుగు నెలల వరకు అభ్యర్థిని ఎందుకు ఫైనల్ చేయలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.టీఆర్ఎస్ ను వీడిన తరువాత ఈటలను సంప్రదించి పార్టీలో చేర్చుకోకపోవడం పై కేసి వేణుగోపాల్ కు బట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. ఆరోపణలు ప్రతి ఆరోపణలతో సమావేశాన్ని అర్దాంతంగా వాయిదా వేయటంతో కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో హుజూరాబాద్ పై చేసిన సమీక్షలో టీపీసీసీ నేతల వార్ పై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశం నుంచి బయటకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేస్తు..సమన్యయ లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ..సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఇలా ఒకరి పైన మరొకరి ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకోవటంతో కోపాలతో మాట్లాడుకుంటే మరిన్ని మాటలు వస్తాయి..పరిష్కారం అనేది దొరకదు కాబట్టి మరోసారి సమావేశం అవుదామని ముఖ్య నేతలు పార్టీ సమావేశం అర్దాంతరంగా ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా ఈ సమావేశానికి జగ్గారెడ్డిని ఆహ్వానించలేదు. ఆయన ఓపెన్ గా ఏం మాట్లాడినా మరింత సమస్యలు వస్తాయనే కారణంతోనే ఆయన్ని దూరంగా ఉంచినట్లుగా సమాచారం.

Read more : World Polluted Cities : ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీనే టాప్..!

కాగా..తనను సమావేశానికి పిలవకపోవడటంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ గా ఉన్న ..నన్ను హుజురాబాద్ బైపోల్ రివ్యూ కు ఎందుకు పిలవలేదు ? అని ప్రశ్నించారు లేఖలో. క్యాండేట్ విషయంలో ఇంచార్జ్ గా నన్ను అడగలేదు? ..నామినేషన్లకు ఒక్కరోజు ముందు అభ్యర్థి ని ఎట్లా నిర్ణయిస్తారు? అని ప్రశ్నించారు. అభ్యర్థి ఎంపికను మూడు నెలల ముందు ఎందుకు నిర్ణయించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా ఇంత జరిగినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాకపోవటం గనమిచాల్సిన విషయం. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వం లేదు అనటానికి ఢిల్లీలో జరిగిన వార్ రూమ్ సమావేశమే ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై నేతలందరి అభిప్రాయాలను నోట్ చేసుకున్న కేసి వేణుగోపాల్ ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సమావేశం అవుతానని తెలిపి సమావేశాన్ని వాయిదా వేశారు. అలా అందరి అభిప్రాయాలు తెలుసుకుని సోనియాగాంధీకి అందజేయనున్నారు కేసి వేణుగోపాల్.