Mahesh Babu : అతను చెప్పింది నిజమే.. మహేష్ బాలీవుడ్ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా..

ఓ విలేఖరి మహేష్ బాబు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దీనికి కంగనా సమాధానమిస్తూ.......................

Mahesh

Kangana Ranaut :  ఇటీవల మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ విలేఖరి మహేష్ బాబుని బాలీవుడ్ లోకి మీరెపుడు అడుగుపెడతారు అని అడిగిన ప్రశ్నకి బాలీవుడ్ నన్ను భరించలేదు, నేను నా టైం వేస్ట్ చేసుకొని, నాకు తెలుగులోనే హాయిగా ఉంది అని సమాధానం ఇచ్చారు. అయితే ఈ మాటలు తప్పుగా ప్రచారం అవ్వడంతో వివాదం చెలరేగింది. కొంతమంది ఈ వ్యాఖ్యలపై మహేష్ ని విమర్శించగా దీంతో మహేష్ మరో ఇంటర్వ్యూలో వీటిపై వివరణ ఇచ్చారు.

 

మహేష్ తాను చేసిన వ్యాఖ్యలకి వివరణ ఇస్తూ.. ”మన తెలుగు సినిమాలు అన్ని చోట్లకి వెళ్తున్నాయి. మన సినిమానే బాలీవుడ్ కి రీచ్ అవుతుంది. రాజమౌళి కాంబినేషన్ లో వచ్చేది పాన్ ఇండియా సినిమానే. అది బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. నాకు అన్ని భాషల మీద గౌరవం ఉంది. నాకు తెలుగులో కంఫర్ట్ గా ఉంది అని చెప్పాను” అంటూ తెలిపారు. అయితే మహేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. తాజాగా మహేష్ చెప్పింది నిజమే కదా అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా మహేష్ కి సపోర్ట్ గా మాట్లాడింది.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్..

కంగనా రనౌత్ త్వరలో ధాకడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఓ విలేఖరి మహేష్ బాబు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దీనికి కంగనా సమాధానమిస్తూ.. ”మహేష్ చెప్పింది నిజమే కావచ్చు. నేను తనతో ఏకీభవిస్తున్నాను. తనకు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నుంచి ఆఫర్లు వస్తాయి. ఎందుకంటే అక్కడి నటీనటులు, దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమను భారతదేశంలోనే నంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మార్చారు. కాబట్టి బాలీవుడ్ అతనిని భరించలేదు. అతడు తన పరిశ్రమ పట్ల గౌరవం చూపించాడు. అది తప్పు కాదు. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమను మనం పట్టించుకోలేదు అని మనకి తెలిసిందే. వాళ్ళు ఎంతో కష్టపడి ఎదిగారు. వారి నుంచి మనం నేర్చుకోవాలి” అని అన్నారు.