Kangana Ranaut : ఎంపీగా గెలిచిన తర్వాత.. ఆశ్రమానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న కంగనా..

తాజాగా కంగనా ఎంపీగా గెలిచినా తర్వాత కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ కి వెళ్ళింది.

Kangana Ranaut : ఎంపీగా గెలిచిన తర్వాత.. ఆశ్రమానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న కంగనా..

Kangana Ranaut Visits Isha Foundation and Takes Blessings From Sadhguru after Winning as MP

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచింది. దీంతో కంగనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఇక కంగనా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా దేవాలయాలకు వెళ్తూ పలు పూజలు చేస్తుంది.

Also Read : Devara – OG : పవన్ OG డేట్‌ని తీసుకుంటున్న దేవర..? మరి గేమ్ ఛేంజర్..?

తాజాగా కంగనా ఎంపీగా గెలిచినా తర్వాత కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ కి వెళ్ళింది. అక్కడ కంగనా ఆదియోగిని దర్శించి అనంతరం సద్గురు ఆశీస్సులు తీసుకొని ఆశ్రమంలో కాసేపు గడిపింది. కంగనా ఆదియోగిని దర్శించి, సద్గురు ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kangana Ranaut Visits Isha Foundation and Takes Blessings From Sadhguru after Winning as MP

ఇక కంగనా బీజేపీ ఎంపీగా గెలవడంతో అభినందనలు వెల్లువెత్తుతుండగా ఇకపై సినిమాలు చేస్తుందా? చేయదా అని అభిమానులు సందేహిస్తున్నారు.