Kangana Ranuat : తాప్సీపై కంగనా ఫైర్..

తాప్సీ తన గురించి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ కంగనా ఎప్పటిలానే తన స్టైల్లో ఫైర్ అయ్యింది..

Kangana Ranuat : తాప్సీపై కంగనా ఫైర్..

Taapsee Kangana

Updated On : June 30, 2021 / 4:17 PM IST

Kangana Ranuat: టాలెంటెడ్ యాక్ట్రెస్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముక్కుసూటిగా మాట్లాడుతుంది.. కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటుంది. ఇండస్ట్రీ దారి ఒకటైతే.. కంగనా దారి మరొకటి అన్నట్లు వ్యవహరిస్తుంటుంది. అవతలి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం ఆమె అలవాటు.

తాప్సీ పన్ను, కంగనా మధ్య గతకొద్ది కాలంగా సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. తాప్సీ తన గురించి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ కంగనా ఎప్పటిలానే తన స్టైల్లో ఫైర్ అయ్యింది. తాప్సీ లాంటి వ్యక్తి నా గురించి కామెంట్స్ చెయ్యడమేంటి అంటూ రచ్చ రచ్చ చేసింది కంగన. తాప్సీ బి గ్రేడ్ యాక్టర్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Kangana

 

నేను రిజెక్ట్ చేసిన సినిమాల నిర్మాతలను అవకాశాలివ్వండంటూ తాప్సీ బ్రతిమాలుకుంటుంది అంటూ కంగన చెలరేగిపోయింది. ఈసారి ఏకంగా తాప్సీ ఫొటో పెట్టి మరీ స్టోరీస్ పోస్ట్ చేసింది కంగన. గతకొద్ది రోజులుగా పెండింగ్‌లో ఉన్న పాస్‌పోర్ట్ రెన్యువల్ ఇష్యూ సాల్వ్ కావడంతో త్వరలో ‘ధాకాడ్’ మూవీ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనుంది కంగన రనౌత్.