Kangana Ranaut : లాంగ్వేజ్ వార్.. హిందీ వద్దు సంస్కృతం ముద్దు అంటూ ఎంటర్ అయిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..

కంగనా కొత్త సినిమా 'ధాకడ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో లాంగ్వేజ్ వార్ పై స్పందించింది. కంగనా మాట్లాడుతూ.. ''హిందీ కంటే కూడా సంస్కృతం మన జాతీయ భాషగా ఉంటే....................

Kangana Ranaut : లాంగ్వేజ్ వార్.. హిందీ వద్దు సంస్కృతం ముద్దు అంటూ ఎంటర్ అయిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..

Kangana

Updated On : April 30, 2022 / 10:28 AM IST

Kangana Ranaut :   గత కొద్ది రోజులుగా సౌత్ సినిమా, బాలీవుడ్ సినిమా అంటూ మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో ఇటీవల కన్నడ స్టార్ హీరో సుదీప్‌ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండదని అన్నారు. దీంతో సుదీప్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. సుదీప్ వ్యాఖ్యలకి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ స్వయంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. అంతే కాక సౌత్, హిందీ నెటిజన్ల మధ్య ఈ వ్యాఖ్యలతో లాంగ్వేజ్ వార్ మొదలైంది. సుదీప్‌కి, అజయ్ దేవగణ్‌కి సపోర్ట్ గా ఇరు పక్షాలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ లాంగ్వేజ్ వార్ పై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించగా తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాట్లాడారు. సంస్కృతం

కంగనా కొత్త సినిమా ‘ధాకడ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో లాంగ్వేజ్ వార్ పై స్పందించింది. కంగనా మాట్లాడుతూ.. ”హిందీ కంటే కూడా సంస్కృతం మన జాతీయ భాషగా ఉంటే బాగుంటుంది. తెలుగు, కన్నడ, తమిళం, గుజరాతీ, హిందీ కంటే కూడా సంస్కృతం భాష చాలా పురాతనమైనది. పైగా భారతీయ భాషలన్నీ సంస్కృతం నుంచే వచ్చాయి. అంతేకాకుండా సంస్కృతం మన దేవభాష. దేవభాష సంస్కృతం కంటే కూడా గొప్పది వేరే భాష లేదనుకుంటా. నన్ను అడిగితే సంస్కృతం జాతీయ భాషగా ఉంటే మంచిది” అని తెలిపింది.

High Court : బిగ్‌బాస్‌ లాంటి అభ్యంతరకర షోలు సమాజానికి ప్రమాదకరం

ఒకపక్క హిందీ జాతీయ భాష మీద అవును, కాదు అని కొట్టుకుంటుంటే తాజాగా కంగనా వచ్చి సంసృతం జాతీయభాషగా ఉండాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.