Chetan Kumar: హిందుత్వం మీద వ్యాఖ్యలతో అరెస్టైన కన్నడ యాక్టర్‌కు బెయిల్
సోమవారం చేసిన చేతన్ ట్వీట్‌లో హిందుత్వ అనేది అబద్ధాల పునాదుల మీద నిర్మించబడిందని రాసుకొచ్చారు. రానణుడిని రాముడు చంపడం అనంతరం భారతదేశం ప్రారంభమైందని సావర్కర్ చెప్పిన మాటలు అబద్ధమని, బాబ్రి మసీదు కింద రామాలయం ఉందనేది అబద్ధమని, అలాగే ఈ మధ్య కర్ణాటకలో ఉరిగౌడ, నంజెగౌడ అనే ఇద్దరు టిప్పు సుల్తాన్‌ను చంపారనే ప్రచారం బీజేపీ పెద్ద ఎత్తున చేస్తోందని

Kannada actor Chetan Kumar gets bail tweet on Hindutva
Chetan Kumar: హిందుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టైన కన్నడ నటుడు చేతన్ కుమార్‌కు బెయిల్ లభించింది. ఈ కేసులో ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించారు. అయితే బెయిల్ కోసం అప్లై చేసుకోగా 25 వేల రూపాయల పూచీకత్తు కింద కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హిందుత్వం అబద్ధాల ఆధారంగా నిర్మించబడిందంటూ చేసిన ట్వీట్‌పై ఫిర్యాదు చేయడంతో శేషాద్రిపురం పోలీసులు నటుడిని అరెస్టు చేశారు. ఆ ట్వీట్‌లో హిందుత్వను ‘సత్యం’ ద్వారా ఓడించవచ్చని, ఎందుకంటే ‘సత్యం సమానత్వం’ అని చేతన్ అన్నారు.
Rahul Gandhi: 2013లో ఏ చట్టాన్నైతే రాహుల్ చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారు
చేతన్ చేసిన ఈ ట్వీట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని భజరంగ్ దళ్‌కు చెందిన ఫిర్యాదుదారు శివకుమార్ ఫిర్యాదు చేశారు. మత విశ్వాసాలను కించపర్చడం, రెండు సమూహాల మధ్య అల్లర్లు రేకెత్తించే విధంగా ప్రవర్తించడం కింద కేసులు నమోదు చేశారు. కాగా, చేతన్ నటుడే కాకుండా దళిత, ఆదివాసీ ఉద్యమకారుడిగా పాపులర్. గతంలో కూడా పలు సందర్భాల్లో హిందుత్వానికి వ్యతిరేకంగా చేతన్ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ భావజాలం కలిగిన అతడు.. సామాజిక కార్యక్రమాల్లో తరుచూ పాల్గొంటాడు.
కాగా, సోమవారం చేసిన చేతన్ ట్వీట్‌లో హిందుత్వ అనేది అబద్ధాల పునాదుల మీద నిర్మించబడిందని రాసుకొచ్చారు. రానణుడిని రాముడు చంపడం అనంతరం భారతదేశం ప్రారంభమైందని సావర్కర్ చెప్పిన మాటలు అబద్ధమని, బాబ్రి మసీదు కింద రామాలయం ఉందనేది అబద్ధమని, అలాగే ఈ మధ్య కర్ణాటకలో ఉరిగౌడ, నంజెగౌడ అనే ఇద్దరు టిప్పు సుల్తాన్‌ను చంపారనే ప్రచారం బీజేపీ పెద్ద ఎత్తున చేస్తోందని, అయితే అది కూడా అబద్ధమని చేతన్ ట్వీట్ చేశాడు. నిజాలతో హిందుత్వాన్ని జయించవచ్చని చివరలో రాసుకొస్తూ సమానత్వమే సత్యం అని అన్నాడు. కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ఈ ట్వీట్ చేశాడు.