అల్లరి నరేష్ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్..

  • Publish Date - September 4, 2020 / 02:53 PM IST

Actress Sharmiela Mandre tests Covid-19 Positive: శాండల్‌వుడ్ పాపులర్ హీరోయిన్ శర్మిలామండ్రేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలుగులో అల్లరి నరేష్ సరసన ‘కెవ్వుకేక’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది శర్మిలామండ్రే. స్వయంగా ఆమె సోషల్ మీడియాలో పాజిటివ్‌ వచ్చినట్లు ప్రకటించింది.

https://10tv.in/ap-political-war-social-media-war-between-old-friends/



తొలివిడత లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు శర్మిలామండ్రే లగ్జరీ కారులో మిత్రులతో కలిసి బెంగళూరులో తిరుగుతూ వసంతనగర్‌లో డివైడర్‌ను, స్తంభాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన మేరకు వారికోసం పోలీసులు వెంటాడాల్సిన పరిస్థితి నెలకొంది.


రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేసుకు సంబంధించి రెండురోజుల కిందటే శర్మిలామండ్రేకు పోలీసులు క్లీన్‌చీట్ ఇచ్చారు. ఇదిలా సాగుతుండగానే తాజాగా గురువారం శర్మిలాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ‘అందరికీ హాయ్.. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చింది. ఇంట్లోనే ఐసోలేషన్ అయ్యాం. వైద్యుల సలహాలను పాటిస్తున్నాం’ అని శర్మిలామండ్రే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.