Sonu Srinivas : చిన్నారి దత్తత విషయంలో బిగ్‌బాస్ భామని అరెస్ట్ పోలీసులు..

కన్నడ నటి, సోషల్ మీడియా పాపులర్ సోను శ్రీనివాస్ ని నేడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు.

Sonu Srinivas : చిన్నారి దత్తత విషయంలో బిగ్‌బాస్ భామని అరెస్ట్ పోలీసులు..

Kannada Bigg Boss Fame Sonu Srinivas Arrested

Updated On : March 22, 2024 / 3:21 PM IST

Sonu Srinivas : కన్నడ నటి, సోషల్ మీడియా పాపులర్ సోను శ్రీనివాస్ ని నేడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు. సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకొని కన్నడ బిగ్ బాస్(Bigg Boss) లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది సోను శ్రీనివాస్. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల కొన్ని వారాల క్రితం సోను శ్రీనివాస్ ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. రాయ్ చూర్ లోని ఓ జంట వద్ద 8 ఏళ్ళ చిన్నారిని దత్తత తీసుకున్నట్టు సమాచారం.

గత కొన్ని రోజులుగా ఆ చిన్నారితో సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ కూడా చేస్తుంది సోను శ్రీనివాస్. చిన్నారిని దత్తత తీసుకున్నందుకు కొంతమంది ఆమెని అభినందిస్తుంటే, మరికొంతమంది ఇలా పబ్లిక్ లో చెప్పి ఆ పాపతో రీల్స్ చేస్తున్నందుకు విమర్శలు చేస్తున్నారు.

Also Read : Sai Pallavi : ‘తండేల్’ షూట్ నుంచి ఫొటోలు.. సాయి పల్లవి ఒళ్ళో పాపతో క్యూట్ గా..

నిన్న గురువారం నాడు బెంగుళూరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు దత్తత తీసుకునే ప్రాసెస్ సరిగ్గా చేయలేదని, ఆ చిన్నారిని ఉపయోగించుకొని సోను శ్రీనివాస్ సెలబ్రిటీ అవ్వడానికి, తనని ప్రమోట్ చేసుకోడాని ఉపయోగిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఆ ఫిర్యాదు పరిశీలించిన బైదరహళ్లి పోలీసులు నేడు ఉదయం సోను శ్రీనివాస్ ని అరెస్ట్ చేసారు.

అరెస్ట్ పై పొలిసు అధికారులు మాట్లాడుతూ.. సరైన దత్తత విధానాలు పాటించలేదని, పిల్లలతో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఆమెని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం అని తెలిపారు. దీనిపై సోను శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. ఈ ఘటనతో సోను శ్రీనివాస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.