Teenagers 17/18 : ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న మరో అవార్డుల సినిమా..
తాజాగా ఆహా ఓటీటీలోకి మరో డబ్బింగ్ సినిమా వచ్చింది.

Kannada Dubbing Movie Teenagers 17/18 Streaming in Aha ott
Teenagers 17/18 : తెలుగు ఓటీటీ ఆహాలో ఇటీవల రెగ్యులర్ గా కొత్త కొత్త సినిమాలు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో వేరే భాషల్లో మంచి విజయాలు సాధించిన డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఆహా ఓటీటీలోకి మరో డబ్బింగ్ సినిమా వచ్చింది.
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’ అనే సినిమాని తెలుగులోడబ్బింగ్ చేసి ‘టీనేజర్స్ 17/18’ అనే పేరుతో ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు. పలు యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. టీనేజర్స్ ప్రస్తుతం ఎదురుంటున్న సమస్యలను ఇందులో చూపించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలానే ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాని పృథ్వీ కొననూర్ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు కూడా. ఈ సినిమాలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read : Devara Part 1: జూ.ఎన్టీఆర్ ట్వీట్‌తో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా?
‘టీనేజర్స్ 17/18’ సినిమా నిన్న సెప్టెంబర్ 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. హనుమాన్ మీడియా ద్వారా నిర్మాత బాలు చరణ్ ఈ సినిమాని ఆహాలోకి తీసుకొచ్చారు. ఇక ఈ ‘టీనేజర్స్ 17/18’ సినిమా బోలెడన్ని అవార్డులు గెలుచుకుంది. మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్స్ లో ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించి అవార్డులు సాధించింది. ఇప్పటికే ఆహా ఓటీటీలో టాప్ 4 లో ఈ సినిమా దూసుకెళ్తుంది. 12 గంటల్లోనే 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ట్రెండ్ అవుతుంది.