Sudeep : బీజేపీ కోసం కాదు ఆయన కోసమే.. పోలింగ్ డే రోజు సుదీప్ సంచలన వ్యాఖ్యలు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ సమయంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ కోసం కాదు బసవరాజు బొమ్మై..

Kannada hero Sudeep says he is campaign for Basavaraj Bommai not BJP

Sudeep : కర్ణాటకలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Karnataka Elections 2023) జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కర్ణాటకలోలోని సాధారణ ప్రజల నుంచి స్టార్ హీరోలు వరకు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఓటు వేసి తన బాధ్యతని నిర్వర్తించాడు. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేసి తన బాధ్యత నిర్వర్తించాడు.

Karnataka Elections 2023: బళ్లారిలో బాహాబాహీ .. చితక్కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

కాగా సుదీప్ ఈ ఎలక్షన్స్ లో కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీ నాయకుడు బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) తరపున స్టార్ క్యాంపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటు వేసిన అనంతరం సుదీప్ మీడియాతో మాట్లాడుతూ.. “నేను క్యాంపెనింగ్ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరు ఓట్లు వేసేయ్యరు. ఓటు హక్కుని ఉపయోగించుకోవడం పౌరులుగా ప్రతిఒక్కరి బాధ్యత. 21 శాతమే పోలింగ్ నమోదు అయిందంటే షాకింగ్ గా ఉంది. అందరూ ముందుకు రావాలి. ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేను సమాజానికి సందేశాలు ఇవ్వడం లేదు. ఓటు ఎంతోమంది భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. ఓటు వెయ్యని వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవిస్తారు. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి” అంటూ ఓటు హక్కుని గుర్తు చేశారు.

Karnataka Election 2023: జేడీఎస్‌తో పొత్తుపై కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన ప్రకటన

అలాగే తన రాజకీయ భవిషత్తు గురించి ప్రశ్నించగా, సుదీప్ బదులిస్తూ.. “నాకు రాజకీయాల్లోకి రావాలని లేదు. దశాబ్దాల కాలం పాటు నటుడిగానే ఉండాలనుకుంటున్నా. రాజకీయాల్లోకి వచ్చే అనుభవం, ఆలోచన అసలు లేదు. ఈ ఎన్నికల్లో కూడా నేను బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేయలేదు. కేవలం బసవరాజు బొమ్మై కోసమే ప్రచారం చేశా” అంటూ వెల్లడించాడు. మరి సాయంత్రం లోపు ఇంకెంత మంది స్టార్స్ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో చూడాలి.