Karnataka Elections 2023: బళ్లారిలో బాహాబాహీ .. చితక్కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

కర్ణాటక ఎన్నికల్లో బళ్లారి నియోజక వర్గం అంటే కాస్త హాట్ హాట్ గానే ఉంటుంది. ఎందుకంటే బళ్లారిలో గాలి బ్రదర్స్ హవా ఒకప్పుడు మామూలుగా ఉండేది కాదు. అటువంటి బళ్లారి రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

Karnataka Elections 2023: బళ్లారిలో బాహాబాహీ .. చితక్కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

Karnataka Elections 2023

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా..మందకొడిగా కొనసాగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో బళ్లారి నియోజక వర్గం అంటే కాస్త హాట్ హాట్ గానే ఉంటుంది. ఎందుకంటే బళ్లారిలో బళ్లారి బ్రదర్స్ హవా ఒకప్పుడు మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా గాలి జనార్థన్ రెడ్డి హవా ఓ రేంజ్ లో ఉండేది. అటువంటి బళ్లారి రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. బళ్లారి రూరల్ నియోజకవర్గంలోని సంజీవరాయనకోటలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రంగా గాయలయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్న ఘటనలో ఎన్నికల ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఉమేశ్ యాదవ్ గాయపడ్డారు. ఉమేశ్ ఓటుహక్కు వినియోగించటానికి పోలింగ్ కేంద్రానికి వెళుతుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఉమేశ్ పై దాడికి దిగారు. ఉమేశ్ పై దాడి జరుగుతోందని తెలిసిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అలా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. ఈ దాడిలో గాయపడిని ఉమేశ్ ను ఆస్పత్రికి తరలించారు. కాగా కర్ణాటక ఎన్నికల్లో ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

కాగా కర్ణాటక రాజకీయాల్లో బళ్లారి అంటే ఠక్కున గుర్తుకొచ్చే వ్యక్తులు గాలి జనార్థన్ రెడ్డి. ఒకప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కన్నడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఓ వెలుగు వెలిగారు మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి. అక్రమ మైనింగ్ కేసులో జైలుపాలైన తరువాత ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తరువాత గాలి అక్రమాలు బయటకు రావటంతో బీజేపీ గాలి విషయంలో సైలెంట్ అయ్యింది. ఆ తరువాత గాలి జనార్థన్ రెడ్డి బీజేపీకి దూరమయ్యారు.అలా కర్ణాటకలో బళ్లారి అంటే గాలి జనార్థన్ రెడ్డి..గాలి అంటే బళ్లారి అన్నటుగా ఉండేది ఒకప్పుడు..