Karnataka Election 2023: జేడీఎస్‌తో పొత్తుపై కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన ప్రకటన

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేడీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో జేడీఎస్‌తో పొత్తు విషయంపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Karnataka Election 2023: జేడీఎస్‌తో పొత్తుపై కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన ప్రకటన

DK Shivakumar

Karnataka Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓట్లర్లు తరలివస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రెండు పార్టీల నేతలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్… 11 గంటలకు 20.94శాతం ఓటింగ్.. లైవ్ అప్‌డేట్స్

కర్ణాటక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో పాటు బీజేపీ కీలక నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ అంతా తానై రోడ్ షోలు, ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Karnataka Polling : నేడే కర్ణాటక అంసెబ్లీ ఎన్నికల పోలింగ్

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హంగ్ ఏర్పడే అవకాశం ఉందని, జేడీఎస్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు.  జేడీఎస్ ఎవరికి మద్దతు ఇస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో  జేడీఎస్‌తో పోత్తు విషయంపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత.. శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం జేడీఎస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలపై విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొత్తు అంశం చర్చకు రాకపోవచ్చని, మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.