Dhruva Sarja : రామ మందిరం కోసం ఎదురు చూసి.. పిల్లలకు పేర్లు పెట్టిన స్టార్ హీరో..

ధ్రువ సర్జాకు 2022 మొదట్లో ఓ పాప పుట్టింది. అయితే ఆ పాపకు ఇప్పటివరకు పేరు పెట్టలేదు. 2023లో ఓ బాబు పుట్టాడు. అతనికి కూడా ఇప్పటివరకు పేరు పెట్టలేదు.

Dhruva Sarja : రామ మందిరం కోసం ఎదురు చూసి.. పిల్లలకు పేర్లు పెట్టిన స్టార్ హీరో..

Kannada Star Hero Dhruva Sarja Naming her Childrens on Ayodhya Ram Mandir Opening Ceremony

Updated On : January 23, 2024 / 10:55 AM IST

Dhruva Sarja : నిన్న దేశమంతా అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. సామాన్య ప్రజల నుంచి, సెలబ్రిటీల వరకు అంతా రాముడిని ప్రార్ధించారు. ఈ నేపథ్యంలో పలు శుభకార్యక్రమాలు కూడా నిర్వహించారు. సీనియర్ నటుడు అర్జున్(Arjun Sarja) మేనల్లుడు, కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా తమ పిల్లలకు పేర్లు పెట్టే కార్యక్రమం కూడా నిన్నే నిర్వహించారు. అయితే దీంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా?

ధ్రువ సర్జాకు 2022 మొదట్లో ఓ పాప పుట్టింది. అయితే ఆ పాపకు ఇప్పటివరకు పేరు పెట్టలేదు. 2023లో ఓ బాబు పుట్టాడు. అతనికి కూడా ఇప్పటివరకు పేరు పెట్టలేదు. ఇన్నాళ్లు కేవలం ముద్దు పేర్లతోనే పిలుచుకున్నారు. అర్జున్ సర్జా ఫ్యామిలీ అంతా ఆంజనేయస్వామి భక్తులు అని తెలిసిందే. దీంతో అయోధ్య రామాలయం ప్రారంభం రోజే తన పిల్లలకు పేర్లు పెడతానని గతంలో తెలిపాడు ధ్రువ సర్జా. నిన్న అయోధ్య ఆలయం ఘనంగా ప్రారంభం జరుగుతున్న సమయంలోనే తన పిల్లలకు పేర్లు పెట్టే శుభకార్యక్రమం నిర్వహించాడు.

Kannada Star Hero Dhruva Sarja Naming her Childrens on Ayodhya Ram Mandir Opening Ceremony

 

Also Read : Republic Day Movies : రిపబ్లిక్ డేకి సినిమాల జాతర.. ఈ వారం థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

రాముడి ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో 12 గంటలకు జరగగా అదే టైంలో ఇక్కడ తన పిల్లలకు పేర్లు పెట్టాడు ధ్రువ సర్జా. పాపకు రుద్రాక్షి అని, బాబుకు హయగ్రీవ అని పేర్లు పెట్టారు. ఇక ఈ కార్యక్రమానికి అర్జున్ సర్జా ఫ్యామిలీతో సహా హాజరయ్యాడు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా హాజరయ్యాడు. ధ్రువ సర్జా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా నామకరణం కార్యక్రమం జరిగింది.