×
Ad

Naga Vamsi : కన్నడ స్టార్ హీరోతో తెలుగు నిర్మాత భారీ సినిమా..

తాజాగా మరో భారీ సినిమాని ప్రకటించారు.

Naga Vamsi

Naga Vamsi : తెలుగు నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. తాజాగా మరో భారీ సినిమాని ప్రకటించారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టితో నాగవంశీ సినిమాని ప్రకటించారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా సినిమాని ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా ఇదేదో యుద్ధ వీరుడికి సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఒక రెబల్ లాంటి వీరుడు ఉదయించాడు అంటూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Also Read : Payal Rajput : హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం.. ఆల‌స్యంగా వెలుగులోకి..

దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రిషబ్ శెట్టి కాంతార తర్వాత ఇప్పటికే వరుస భారీ సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో కూడా జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు సితార బ్యానర్ లో ఈ భారీ సినిమాకు ఓకే చెప్పారు. ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన నేపథ్యంలో కథ అని తెలుస్తుంది. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషలలో బైలింగ్వల్ గా తెరకెక్కిస్తుండగా తెలుగు, కన్నడతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read : “రాజాసాబ్‌” సెట్‌కు వెళ్లి ప్రభాస్‌ను కలిసిన పూరి జగన్నాథ్, చార్మీ.. ఫొటోలు వైరల్