“రాజాసాబ్” సెట్‌కు వెళ్లి ప్రభాస్‌ను కలిసిన పూరి జగన్నాథ్, చార్మీ.. ఫొటోలు వైరల్
మరోవైపు, 'రాజాసాబ్' సినిమా నుంచి ఆ మూవీ యూనిట్ ఇవాళ సంజయ్ దత్ లుక్‌ను విడుదల చేసింది.

పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మీ ఇవాళ “రాజాసాబ్” సినిమా సెట్‌లో కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ను వారు ఎందుకు కలిశారన్న విషయంపై క్లారిటీ లేదు.. మామూలుగానే కలిసినట్లు తెలుస్తోంది.
గతంలో ప్రభాస్‌తో పూరి జగన్నాథ్ బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు తీశారు. ఆ సినిమాలు అంతగా ఆడకపోయినా నటనలో ప్రభాస్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఆ సినిమాల్లో ప్రభాస్‌లో కనపడిన ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత పూరి, ప్రభాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు.
Also Read: విజయ్ దేవరకొండ కాదు.. బంగారు కొండ.. : సత్యదేవ్
సంజయ్ దత్ లుక్ విడుదల
మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఆ సినిమా యూనిట్ ఇవాళ సంజయ్ దత్ లుక్‌ను విడుదల చేసింది. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.
సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.
View this post on Instagram