Payal Rajput : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం.. ఆలస్యంగా వెలుగులోకి..
టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Payal Rajput Father Vimal Kumar Dies
టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పాయల్ తెలియజేసింది. ఆయన వయసు 67 సంవత్సరాలు.
విమల్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో జూలై 28 (సోమవారం) కన్నుమూశారు. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారని ఇదే ఏడాదిలో పాయల్ చెప్పిన సంగతి తెలిసిందే.
Sathi Leelavathi : మెగా కోడలు లావణ్య కొత్త సినిమా.. ‘సతీ లీలావతి’ టీజర్ రిలీజ్..
View this post on Instagram
క్యాన్సర్‌తో పోరాడుతున్న తండ్రిని కాపాడుకునేందుకు తాను చేయాల్సినవన్నీ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ చివరకు కాపాడుకోలేకపోయినట్లు ఎమోషనల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ విషయం నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది పాయల్ రాజ్‌పుత్. ఆ తరువాత ‘వెంకీమామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వెంకటలచ్చిమి” అనే చిత్రంలో నటిస్తోంది.