Kantara Chapter 1
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి కాంతార సినిమా సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్ అయింది. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఆల్మోస్ట్ 400 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మొదట బాగానే హైప్ ఉంది. కానీ ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇదేంటి రొటీన్ కథలా ఉందే అనుకున్నారు.(Kantara Chapter 1)
దానికి తోడు కర్ణాటక సినిమాల వివాదం, రిషబ్ తెలుగులో మాట్లాడకపోవడం, ప్రమోషన్స్ కూడా సింపుల్ గా ఒక్కో స్టేట్ లో ఒక్కో ఈవెంట్ తో సరిపెట్టేయడంతో సినిమాకు ఎక్కువ ప్రచారం జరగలేదు. ట్రైలర్, సాంగ్స్ లో సినిమాకు కావాల్సినంత హైప్ లేదు. దీంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్న సినిమాకు నిరాశే ఎదురైంది. అసలే కాంతార హిట్ అవ్వడంతో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
Also Read : I Bomma : పోలీసులకు, సినీ పరిశ్రమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ.. గతంలో ఇచ్చిందే మళ్ళీ వైరల్..
ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేస్తామని ప్రకటించారు. కానీ ప్రీమియర్స్ బుకింగ్స్ అనుకున్నంత వచ్చేలా కనపడట్లేదని క్యాన్సిల్ చేసినట్టు సమాచారం. బయటకు మాత్రం ఫైనల్ కాపీ ఇంకా రెడీ అవుతుందని చెప్తున్నారు. మొదట కాంతార సినిమాకు ఓపెనింగ్ దాదాపు 100 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు కేవలం 20 కోట్లే అయ్యాయని సమాచారం. అందులో కన్నడ నుంచే ఎక్కువగా 12 కోట్లు, మిగతాది ఓవర్సీస్, వేరే రాష్ట్రాల్లో బుకింగ్స్ అయినట్లు తెలుస్తుంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా కేవలం తెలుగు టార్గెట్ చేసుకొని రిలీజ్ చేసినా ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాదాపు 85 కోట్ల గ్రాస్ వచ్చింది. కాంతార ఏమో పాన్ ఇండియా అంటున్నా, అన్ని భాషల్లో రిలీజ్ చేసినా OG కి వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్స్ లో సగం కూడా రావట్లేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ భాషా వివాదం లేకపోతే ఇంకొన్ని కలెక్షన్స్ పెరిగేవేమో అని అంటున్నారు. అసలే బాయ్ కాట్ కాంతార ట్రెండ్ నడిచింది.
Also Read : Idli Kottu Review : ‘ఇడ్లీ కొట్టు’ మూవీ రివ్యూ.. సినిమా అంతా ఏడిపించేశారుగా.. నాన్న గుర్తొస్తాడు..
రేపు సినిమా రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ అయితే బాగానే రావొచ్చు అని భావిస్తున్నారు. కన్నడలో మాత్రం ఈజీగా మొదటి వీకెండ్ వరకే కాంతార సినిమాకు 100 కోట్ల పైనే కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. మరి మిగతా భాషల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. కాంతార 400 కోట్లను మించి కాంతార చాప్టర్ 1 కలెక్ట్ చేస్తుందా చూడాలి.