I Bomma : పోలీసులకు, సినీ పరిశ్రమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ.. గతంలో ఇచ్చిందే మళ్ళీ వైరల్..
గతంలో ఐ బొమ్మ వెబ్ సైట్ తన సైట్ లో పోలీసులకు, పరిశ్రమకు వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ పెట్టింది. (I Bomma)

I Bomma
I Bomma : ఇటీవల తెలంగాణ పోలీసులు సినిమా పైరసీ చేసిన వాళ్ళను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 22 వేల కోట్ల నష్టం ఈ పైరసీ వల్ల వాటిల్లిందని తెలిపారు. దీనిపై పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి.. పైరసీ పై మరింత ఫోకస్ చేస్తాము. ముఖ్యంగా ఐ బొమ్మ ని వదలం, ఐ బొమ్మ సైట్ హెడ్ ని పట్టుకుంటాం. దానికి పనిచేసే నలుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేసాము అని తెలిపారు. ప్రస్తుతం ఐ బొమ్మ కోసం పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న నిర్వాహకుల గురించి వెతుకుతున్నారు పోలీసులు.
అయితే గతంలో ఐ బొమ్మ వెబ్ సైట్ తన సైట్ లో పోలీసులకు, పరిశ్రమకు వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ పెట్టింది. తాజాగా మరోసారి ఆ నోట్ పెట్టి మళ్ళీ వైరల్ గా మారింది.
Also Read : Idli Kottu Review : ‘ఇడ్లీ కొట్టు’ మూవీ రివ్యూ.. సినిమా అంతా ఏడిపించేశారుగా.. నాన్న గుర్తొస్తాడు..
I Bomma
ఐ బొమ్మ తన సైట్ లో.. మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. అసలు హీరోలకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా. సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్, విదేశాలలో షూటింగ్ లకు, ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్య తరగతివాడే బాధపడుతున్నాడు.
ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది. బురదలో రాయి వేయకండి… అది కూడా పెంట మీద అసలు వేయకండి. మేము ఏ దేశం లో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వాళ్ళకోసం ఆలోచిస్తాము. చావుకు భయపడని వాడు దేనికి భయపడడు అని రాసుకొచ్చారు. అయితే దీనిపై మిశ్రమ స్పందనను వస్తున్నాయి. చేసేదే తప్పు పని మళ్ళీ దానిని సమర్ధించుకుంటున్నారు అని పలువురు సీరియస్ అయితే పైరసీలలో సినిమాలు చూస్తున్నవాళ్లు మాత్రం ఐ బొమ్మకు సపోర్ట్ చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు, సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాపై జాన్వీ కామెంట్స్.. ఐ లవ్ రామ్ సర్ అంటూ.. ఇంకా హైప్ పెంచేసిందిగా..