Kantara: ‘కాంతార’ కాస్ట్‌లీ మేడ.. అది ఏమిటో, ఎక్కడుందో తెలుసా?

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ ప్రస్తుతం ఇండియావైడ్‌గా ప్రేక్షకులను అలరిస్తూ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా కంటెంట్‌కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటే, ఈ సినిమాలో కనిపించే కాస్ట్‌లీ మేడ.

Kantara Landlord House Is Luxurious Beach Resort

Kantara: కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ ప్రస్తుతం ఇండియావైడ్‌గా ప్రేక్షకులను అలరిస్తూ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా కంటెంట్‌కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక రిషబ్ శెట్టి సహా ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్‌కు వారు ఫుల్ మార్కులు వేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటే, ఈ సినిమాలో కనిపించే కాస్ట్‌లీ మేడ.

Kantara: కాంతార సినిమాపై బాలీవుడ్ క్వీన్ కామెంట్స్.. ఏమందంటే..?

కాంతార సినిమా చూసిన వారికి అందులో భూస్వామి పాత్ర గురించి బాగా తెలిసి ఉంటుంది. అచ్యుత్ కుమార్ నటించిన ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఈ భూస్వామి ఉండే మేడ చాలా ప్రాచీనంగా కనిపిస్తూనే చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. దీంతో ఈ మేడ ఎక్కడిదా అని అభిమానులు ఆసక్తిగా నెట్టింట వెతుకుతున్నారు. అయితే ఈ సినిమాలో చూపించిన ఈ భవనం, నిజానికి ఓ లగ్జరీ రిసోర్ట్ అని తెలిసి అందరూ షాకవుతున్నారు.

Kantara : కాంతార సినిమా ఎఫెక్ట్.. వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. చాలా మందికి చేయూత..

కర్ణాటకలోని ముల్లూరు బీచ్ సమీపంలో ఉన్న సాయి రాధా హెరిటేజ్ బీచ్ రిసోర్ట్‌లో కాంతార చిత్ర షూటింగ్ జరిపారు. ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ రిజార్ట్‌లో తెరకెక్కించగా, ఇప్పుడు కాంతారతో ఈ రిజార్ట్‌కు అనుకోని గుర్తింపు లభించింది. తులు సంప్రదాయం ఉట్టిపడేలా ఈ రిజార్ట్ ఉండటంతో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక విలాసవంతమైన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉండటంతో ఈ రిజార్ట్ ప్రత్యేకతను చాటుకుంది. కాంతార చిత్రంలో ఈ రిజార్ట్‌ను చూసిన చాలా మంది ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్తుండటం విశేషం.