Kantara: కాంతార సినిమాపై బాలీవుడ్ క్వీన్ కామెంట్స్.. ఏమందంటే..?

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం ప్రస్తుతం యావత్ దేశాన్ని ఊపేస్తుంది. సినిమాలో కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే, ఎలాంటి భాషలో అయినా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేసింది. తాజాగా కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌత్.

Kantara: కాంతార సినిమాపై బాలీవుడ్ క్వీన్ కామెంట్స్.. ఏమందంటే..?

Kangana Ranaut Praises Kantara Movie

Kantara: కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం ప్రస్తుతం యావత్ దేశాన్ని ఊపేస్తుంది. సినిమాలో కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే, ఎలాంటి భాషలో అయినా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేసింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.

Kantara : కాంతార సినిమా ఎఫెక్ట్.. వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. చాలా మందికి చేయూత..

కామన్ ఆడియెన్స్ మొదలుకొని సెలబ్రిటీలు వరకు ఈ సినిమాను ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌత్. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూశానని.. ఈ సినిమా ఇంకా తన మదిలోనే మెదులుతుందని.. ఇది ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అని ఆమె కొనియాడింది. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ సినిమా అని కంగనా పేర్కొంది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి రచన, యాక్టింగ్, డైరెక్షన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయని ఆమె తెలిపింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని కంగనా చెప్పుకొచ్చింది.

Kantara : ‘కాంతారా’కు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ఉండబోతోంది.. కానీ..

ఇక ఈ సినిమాను అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయగా, రోజురోజుకూ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, హొంబాలే ఫిలింస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేసింది. మరి ఈ సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.