Koffee with Karan : విజయ్ దేవరకొండ లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశాడో అనన్య పాండేకి తెలుసంట.. బాబోయ్ ఈ ప్రోమో చూస్తే..

బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ పూర్తవగా నాలుగో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే గెస్టులుగా రాబోతున్నారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో.........

Koffee with Karan : విజయ్ దేవరకొండ లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశాడో అనన్య పాండేకి తెలుసంట.. బాబోయ్ ఈ ప్రోమో చూస్తే..

Ananya

Updated On : July 27, 2022 / 6:57 AM IST

Koffee with Karan :  బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ పూర్తవగా నాలుగో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే గెస్టులుగా రాబోతున్నారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ ప్రోమోలో కరణ్ విజయ్ ని చాలా వరకు పర్సనల్ క్వశన్స్ అడిగినట్టు తెలుస్తుంది.

ఈ ప్రోమోలో మొదట అనన్యని తన కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు కరణ్. అలాగే అనన్య, ఆదిత్య కపూర్ తో నా పార్టీలో ఏం చేశావో చూశాను అని అనడంతో అనన్య చెప్పొద్దూ అని అంది. ఆ తర్వాత విజయ్ ని నీకు చీజ్ అంటే ఇష్టమా అని అడిగితే ఇష్టమే కాని అది ఎక్కడి నుంచి కారిపోతుందో అని భయం అని చెప్పాడు విజయ్. దీంతో గత ఎపిసోడ్ లో జాన్వీ, సారా విజయ్ చీజ్ గా మేము అవ్వాలి అనుకుంటున్నాము అని చెప్పింది చూపించారు. అనన్య కూడా నేను కూడా అందులో ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పింది.

Vijay Devarakonda: ముగ్గురితో సై అంటోన్న రౌడీ!

కరణ్ విజయ్ ని ఉద్దేశించి లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశావు అని అడిగితే విజయ్.. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పను అన్నాడు, అనన్య నేను గెస్ చేస్తాను అని ఇవాళ ఉదయం చేశావు కదా అని అంది. అలాగే పబ్లిక్ ప్లేస్ లో చేస్తే ఎలా చేస్తావ్ అని అడిగాడు కరణ్. దానికి విజయ్ కార్ లో అని చెప్పడంతో కార్ లో కుదురుతుందా అని అడిగాడు కరణ్. ఇక ఇద్దరితో ఒకేసారి ఎప్పుడైనా సెక్స్ చేశావా అని అడిగితే నో అన్నాడు విజయ్. ఛాన్స్ వస్తే చేస్తావా అంటే ఓకే అన్నాడు విజయ్. ఇలా ప్రోమో అంతా బోల్డ్ ప్రశ్నలే ఉన్నాయి. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇక ప్రోమోలోనే ఇంతుంటే ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని ప్రశ్నలు ఉన్నాయో అని అనుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ జులై 28న హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.