కరీనాకు మళ్లీ కొడుకు పుట్టాడు..

కరీనాకు మళ్లీ కొడుకు పుట్టాడు..

Updated On : February 21, 2021 / 4:14 PM IST

Kareena Kapoor Baby Boy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ రోజు ఆదివారం (21 ఫిబ్రవరి) ఉదయం 9 గంటలకు ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కరీనాకు ప్రసవం జరిగిందని, మగ బిడ్డ జన్మించాడని కరీనా తండ్రి రణ్‌ధీర్ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

kareena kapoor khan

తల్లీ, బిడ్డా ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని, తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తికి స్వాగతం చెబుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు రణ్‌ధీర్ కపూర్.. 2012లో స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది కరీనా.. ఈ దంపతులకు 2016లో తైమూర్‌ అలీఖాన్‌ జన్మించాడు.

Kareena Kapoor Khan

 

గర్భంతో ఉన్నప్పుడు కూడా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌లో పాల్గొంది కరీనా.. అలాగే పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరించింది. సైఫ్, డెలివరీ తర్వాత కరీనా, చిన్నారితో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది..

https://10tv.in/kareena-kapoors-fitness-mantra/