Kamal Haasan : కమల్ హాసన్ కి షాక్ ఇచ్చిన ఫిలిం ఛాంబర్.. అయినా తగ్గేదేలే అంటున్న కమల్.. తలపట్టుకున్న థగ్‌ లైఫ్ నిర్మాతలు..

కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే అధికారికంగానే సినిమాను బ్యాన్ చేస్తాం అంటూ నోటీసులు ఇచ్చింది.

Karnataka Film Chamber of Commerce Fires on Kamal Haasan and Thug Life Movie

Kamal Haasan : కమలహాసన్ సినిమాల్లో ఎంత గ్రేట్ యాక్టర్ అయినా బయట, రాజకీయ పరంగా పలుమార్లు తన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ జూన్ 5న థగ్‌ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల బెంగుళూరులో ఈవెంట్ నిర్వహించగా కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టింది అంటూ మాట్లాడాడు.

మామూలుగానే కన్నడ ప్రజలకు భాషాభిమానం ఎక్కువ. అక్కడ నివసించేవాళ్ళు కన్నడ మాట్లాడకపోతేనే గొడవలు పెడతారు. అలాంటిది కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేసాక ఎలా ఊరుకుంటారు. రోడ్డెక్కి రచ్చ చేసారు, కమల్ క్షమాపణ చెప్పాల్సిందే కన్నడ ప్రజలకు అన్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. సినిమాని బ్యాన్ చేస్తామంటూ ఉద్యమించారు. కర్ణాటక రాజకీయ నేతలు కూడా కమల్ పై మండిపడ్డారు.

Also Read : Balakrishna : బాలయ్య మ్యాన్షన్ హౌజ్ యాడ్ చూశారా..? సింహం మీద సవారి.. అదిరిందిగా..

అయినా కమల్ తెలివిగా ప్రేమతోనే అలా మాట్లాడానని, ప్రేమ ఎప్పుడూ సారీ చెప్పదని అన్నారు. అయినా కన్నడ ప్రజలు వదల్లేదు. ఈసారి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది. థగ్‌ లైఫ్ సినిమా రిలీజ్ లోపు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే అధికారికంగానే సినిమాను బ్యాన్ చేస్తాం అంటూ నోటీసులు ఇచ్చింది.

ఇప్పటికైనా కమల్ క్షమాపణలు చెప్తారు అనుకుంటే క్షమాపణలు చెప్పకపోగా.. నేను తప్పు చేస్తేనే సారీ చెప్తాను. మనది ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను. కర్ణాటక పట్ల నాది నిజమైన ప్రేమ. ఆంధ్ర, కేరళ విషయంలో కూడా అంతే. ఏదైనా అజెండాతో వచ్చేవారు తప్ప, ఎవరూ నన్ను అనుమానించరు. నాకు గతంలో కూడా ఇలా బెదిరింపులు వచ్చాయి. నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తాను లేకపోతే చెప్పను. ఇంకా దీనిని లాగకండి అని అన్నారు. దీంతో కర్ణాటక ప్రజలు మరింత మండిపడుతున్నారు. ఈ వ్యవహారం అంతా నిర్మాతకు, కమల్ సినిమా కొన్న కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ కి తలనొప్పిగా మారింది. కమల్ వ్యాఖ్యలతో కర్ణాటకలో థగ్‌ లైఫ్ సినిమాకు నష్టాలొస్తాయని, జనాలు రారని అంటున్నారు.

Also Read : Allu Arjun : రెండు అవార్డులతో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఇక ఈ ఛాన్స్ ఎవరికీ రాదేమో..