Meiyazhagan : ’96’ మూవీ ఫేమ్ ద‌ర్శ‌కుడితో కార్తీ.. సినిమా పేరేంటో తెలుసా..? ఫ‌స్ట్ లుక్ వైర‌ల్‌

త‌మిళ స్టార్ హీరో కార్తీ 96 ఫేమ్ డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు.

Meiyazhagan : ’96’ మూవీ ఫేమ్ ద‌ర్శ‌కుడితో కార్తీ.. సినిమా పేరేంటో తెలుసా..? ఫ‌స్ట్ లుక్ వైర‌ల్‌

Karthi Meiyazhagan First Look release

Meiyazhagan First Look : త‌మిళ స్టార్ హీరో కార్తీ 96 ఫేమ్ డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. అర‌వింద స్వామి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కార్తీ కెరీర్‌లో 27వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ మూవీకి ‘మెయ్యళగన్’ అనే పేరును ఖ‌రారు చేశారు.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో అర‌వింద్ స్వామి సైకిల్‌ను న‌డుపుతుండ‌గా వెనుక కూర్చున్న కార్తీ సంతోషంలో మునిగిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మొత్తంగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తుండ‌గా 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య- జ్యోతిక నిర్మిస్తున్నారు. రాజ్ కిర‌ణ్, శ్రీదేవి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Satyabhama Trailer : స‌త్యభామ ట్రైల‌ర్‌.. కాజ‌ల్ అగ‌ర్వాల్ కుమ్మేసిందిగా..