Karthik Raju coming soon with I hate You Movie after Atharva
Karthik Raju : హీరో కార్తీక్ రాజు వరుస సినిమాలు చేస్తున్నాడు. కౌసల్య కృష్ణమూర్తి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రాజు ఇటీవలే ‘అధర్వ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఫోరెన్సిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. దీనికి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. ఇటీవలే హస్తినాపురం, మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు కార్తీక్ రాజు.
ఇప్పుడు కార్తీక్ రాజు త్వరలో ‘ఐ హేట్ యు’ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ రాజు హీరోగా, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్స్ గా బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ నిర్మాణంలో నూతన దర్శకుడు అంజి రామ్ దర్శకత్వంలో ‘ఐ హేట్ యు’ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
Also Read : Chiranjeevi – Venkatesh : చిరంజీవి హైదరాబాద్‌లో.. వెంకటేష్ వైజాగ్‌లో.. ఇవాళ రాత్రికి..
తాజాగా ‘ఐ హేట్ యు’ సినిమా నిర్మాత నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐ హేట్ యు’ సినిమా లవ్ సైకలాజికల్ కథాంశంతో రాబోతుంది. లవ్ లో కొత్త సబ్జెక్ట్‌తో డైరెక్టర్ అంజిరామ్‌ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు. హీరో కార్తీక్ రాజు, హీరోయిన్స్ మోక్ష, షెర్రీ అగర్వాల్, మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సహకారంతో సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమా బాగా వస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం అని తెలిపారు.