Sreeleela: బాలీవుడ్‌లోకి శ్రీలీల.. ఆ హీరోతో మూవీ.. ఫస్ట్‌లుక్, రిలీజ్ డేట్ వీడియో విడుదల.. అదిరిపోయిందంతే..
ఇది ఒక ప్రేమకథగా రూపుదిద్దుకుంటోంది.

బాలీవుడ్‌లోకి శ్రీలీల అడుగుపెట్టింది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. దీంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ అంశం అధికారికగా వెలువడినట్లయింది.

కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్‌లో వరుసగా హిట్‌లు కొడుతున్నాడు. అతడి సరసన శ్రీలీలకు అవకాశం రావడంతో ఈ అమ్మడు బాలీవుడ్‌లో మున్ముందు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉంది.
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల నటిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇంకా రివీల్ చేయలేదు. ఈ రొమాంటిక్ ఫిల్మ్ ఈ ఏడాది దివాలీకి విడుదల కానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.
కిస్సిక్ పాటతో పుష్ప 2 సినిమాలో అలరించిన శ్రీలీల కార్తీక్ ఆర్యన్‌తోనూ అదే రీతిలో నటించింది. అంటే కార్తీక్ ఆర్యన్‌కు ఆమె కిస్‌లు పెట్టే సీన్లను ఈ వీడియోలో ఆ సినిమా యూనిట్ చూపించింది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఇది ఒక ప్రేమకథగా రూపుదిద్దుకుంటోంది.
అందరి హృదయాలకు హత్తుకునేలా ఈ సినిమా తీస్తున్నామని ఆ మూవీ యూనిట్ చెప్పింది. కార్తీక్ ఆర్యన్ ఇందులో భారీ గడ్డంతో, పొడవాటి జుట్టుతో కనపడి అలరిస్తున్నాడు. దాన్ని చూస్తేనే కార్తీక్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.
This Diwali ❤️🔥@basuanurag @sreeleela14 #BhushanKumar @ipritamofficial #TaniBasu @ShivChanana @neerajkalyan_24 @TSeries #Diwali2025 pic.twitter.com/Ysk1U1YAJ5
— Kartik Aaryan (@TheAaryanKartik) February 15, 2025