Covid positive : నాకు కరోనా వచ్చింది..కోలుకోవాలని ప్రార్థించండి – కార్తీక్ ఆర్యన్

Covid positive : నాకు కరోనా వచ్చింది..కోలుకోవాలని ప్రార్థించండి – కార్తీక్ ఆర్యన్

Kartik Aaryan

Updated On : March 22, 2021 / 4:18 PM IST

Kartik Aaryan : కార్తీక్ ఆర్యన్…బాలీవుడ్ లో యువ నటుల్లో ఒకరు. ఈ అందమైన కుర్రొడు బ్రహ్మచారి. సమ్మోహమైన నవ్వులతో అలరిస్తుంటాడు. అయితే..ఇతనికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశాడు ఈ యంగ్ హీరో కార్తీక్. తాను కోలుకోవాలని ప్రార్థించాలని (Positive ho gaya. Dua karo) అభిమానులను ఆయన కోరారు. కార్తీక్ ఇటీవలే నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ (Lakme Fashion Week)లో డిజైనర్ (ace designer) మనీష్ మల్హోత్రతో నడిచాడు. కార్తీక్ తో పాటు..భూ భూలైయా 2 లో నటించిన కో యాక్టర్ కియారా అద్వానీ కూడా ర్యాంప్ లో నడిచారు.

ముంబైలో తనింటిలో 9 నెలలకు పైగా ఇంట్లో గడిపాడు ఈ హీరో. తర్వాత..Dhamaka చిత్రం కోసం నిర్ణయించిన షెడ్యూల్ లో పాల్గొన్నాడు. అదే సమయంలో భూల్ భూలైయా 2 షూటింగ్ కూడా ప్రారంభించాడు. కియారాతో కలిసి..మనాలీలో షూటింగ్ లో పాల్గొన్నాడు కార్తీక్. ఇంకా షూటింగ్ కొనసాగుతోంది. కానీ..ప్రస్తుతం కార్తీక్ కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ పై ప్రభావం చూపెట్టనుంది. మరోవైపు..కరణ్ జోహార్ ఫిల్మ్ దోస్తానా – 2 (Dostana 2) లో Janhvi Kapoor, Laksh Lalvani తో కనిపించనున్నాడు. ప్రస్తుతం తనకు కరోనా సోకిందని..త్వరలో కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరాడు ఈ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)