90 ML – రివ్యూ

కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన ‘90 ML’ మూవీ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : December 6, 2019 / 10:41 AM IST
90 ML – రివ్యూ

Updated On : December 6, 2019 / 10:41 AM IST

కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన ‘90 ML’ మూవీ రివ్యూ..

సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీతో ప్రతి సినిమాలో ఆడియన్స్ అటెన్షన్‌ను క్యాచ్ చేస్తున్న హీరో కార్తికేయ. ఫస్ట్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ తో హీరోగా సూపర్ హిట్ కొట్టిన కార్తికేయ ఆ తరువాత జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుని తన ప్లేస్ నిలబెట్టుకుంటున్నాడు.. ‘90 ఎంఎల్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో గత కొద్ది కాలంగా హడావిడి చేస్తున్నాడు.. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంత వరకు అలరించిందో చూద్దాం..

కథ విషయానికి వస్తే :
దేవదాసు పుట్టడమే ఫేటల్ ఆల్కహాలిక్ డిజార్డర్‌తో పుడతాడు. అయితే అతను ఆల్కహాల్‌కి రియాక్ట్ అవుతుండడంతో డాక్టర్ అతనికి రోజూ ఆల్కహాల్ తాగించమని ఆధరైజ్డ్ డ్రింకర్ సర్టిఫికెట్ ఇస్తాడు. పెరిగి పెద్దవాడయిన దేవదాసు రోజుకి మూడు పూటలా కూడా 90ML తాగాల్సిందే.

ఒక వేళ అలా తాగకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం. అలాంటి అతను అసలు ఆల్కాహాల్ వాసనే పడని ఫ్యామిలీ నుండి వచ్చిన సువాసనని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. దేవదాసు రోజూ 90ML తాగుతాడు అనే విషయం తెలియక అతనితో ప్రేమలో పడుతుంది.

ఒక సంఘటనలో ఆ విషయం తెలుస్తుంది.దాంతో ఆమె అతనికి బ్రేకప్ చెబుతుంది. ఈ మధ్యలో వీరి ప్రేమకు ఓ విలన్ అడ్డు పడుతుంటాడు.. ఈ సమస్యలు అన్నీ దాటుకుని ప్రేయసి ప్రేమను గెలవగలిగాడా.. లేదా అనేది తెరపై చూడాలి..

Image
నటీనటులు విషయానికి వస్తే :
కార్తికేయ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. టాలీవుడ్ దొరికిన హాలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు మరియు ఆరడుగుల సాలిడ్ ఫిజిక్‌తో చేసే పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ పర్ఫెక్ట్‌గా చేశాడు. ఫిజియో థెరఫిస్ట్‌గా హీరోయిన్ నేహా సోలంకి క్యూట్ పర్ఫామెన్స్ ఇచ్చింది.

సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌తో ఆకట్టుకుంది. ఇక హీరో ఫ్రెండ్‌గా బిగ్‌బాస్ ఫేమ్ రోల్ రైడా ఫుల్ టైమ్ రోల్ దక్కించుకున్నాడు. పంచులతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విలన్‌‌‌గా రవికిషన్ కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. రావు రామేష్, సత్యప్రకాశ్, ప్రగతి లాంటి సీనియర్ నటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.. మిగతా నటీనటులు వారి పరిధి మేర నటించారు.

టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే :
దర్శకుడు యెర్ర శేఖర్ రెడ్డి ఓ కొత్త పాయింట్ చుట్టూ ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పాలనే క్రమంలో ఓల్డ్ స్క్రీన్‌ప్లే ఫార్మాట్ తీసుకున్నారు. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం బాగా రాసుకున్నప్పటికీ వాటిని తెరపై సరైన క్రమంలో పేర్చడంలో విఫలం చెందారు.

కొత్త దర్శకుడు కావడంతో ఆయనకు అంతగా అనుభవం లేని విషయం.. తెరపై కనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం పాటల పరంగా బాగానే ఉన్నప్పటికీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ పూర్తిగా నిరాశ పరుస్తుంది..

Image
ఓవరాల్‌గా చెప్పాలి అంటే :
యంగ్ హీరో కార్తికేయ ‘90ఎంఎల్’అంతకిక్ ఇవ్వలేకపోయిందనిచెప్పాలి. కొత్తపాయిట్ తీసుకున్నా.. ప్రేమ, ఘర్షణను ఎమోషనల్గా చెప్పాలనుకున్నప్పటికి, పాతకాలపు స్క్రీన్‌‌ప్లే, అవసరం లేని విలనిజం సినిమా సోల్‌ని దెబ్బ తీశాయి. ఈ వారం పెద్ద సినిమాలు లేవు కాబట్టి బాక్సాఫీద్ దగ్గర ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
హీరో, హీరోయిన్ల నటన
కామెడీ..

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే
ఎడిటింగ్
మ్యూజిక్
దర్శకత్వం..