Kasthuri Shankar
Kasthuri Shankar : ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 జరుగుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్స్ తో పోలిస్తే చప్పగా సాగుతుంది. గతంలో లాగా ఈసారి బిగ్ బాస్ పై ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. కామనర్స్ అంటూ ఎవరూ తెలియని వాళ్ళని బిగ్ బాస్ కి తీసుకురావడంతో షోపై చాలా మందికి ఆసక్తి పోయింది, రీచ్ కూడా బాగా తగ్గింది. ఇప్పటికే వైల్డ్ కార్డ్స్ ద్వారా మొత్తం 22 మంది హౌస్ లోకి రాగా 9 మంది ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు.(Kasthuri Shankar)
తాజాగా సీనియర్ నటి కస్తూరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి మాట్లాడింది.
Also Read : Samantha : అప్పుడేమో చేసేసి.. ఇప్పుడు ఇబ్బంది పడ్డాను అని చెప్తున్న సమంత..
కస్తూరి మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ చూడను. గతంలో తమిళ్ బిగ్ బాస్ ఓ సెలబ్రిటీ వీక్ కింద ఒక వారం ఉండి వచ్చాను. అయితే ఈసారి తెలుగులో నిఖిల్ నాయర్ ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు చూస్తున్నాను. ఈసారి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ నాయర్. వైల్ఫ్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అతనికి అన్ని సాధ్యమే. ఆడతాడు, కప్పు గెలుస్తాడు. గృహలక్ష్మి సీరియల్ లో అతను నా కొడుకు. అతని గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.
దీంతో నటుడు నిఖిల్ నాయర్ ఫ్యాన్స్ కస్తూరి వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు. మళయాళంకు చెందిన నిఖిల్ నాయర్ అక్కడ సీరియల్స్ లో నటిస్తూ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో పలుకే బంగారమాయెనా, గృహలక్ష్మి సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Also See : Komalee Prasad : అరుణాచలం ఆలయ దర్శనం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..