Kaveri : ‘కావేరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. రిలీజ్ ఎప్పుడంటే.. ?

తాజాగా కావేరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

Kaveri Movie Pre Release Event Release Date Announced

Kaveri : రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కావేరి’. స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకాషు నిర్మాణంలో రాజేష్ నెల్లూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కావేరి సినిమా ఆగస్టు 30 రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

కావేరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. కావేరి సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం ఇవ్వడమే కాక మరో రెండు సినిమాలకు నన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు నిర్మాత అల్లాబకాషు. కావేరి సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుంది అని అన్నారు. హీరోయిన్ రిషిత మాట్లాడుతూ.. పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలు చెబుతారు. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల అకృత్యాలు సొసైటీలో జరగవు. మా సినిమాలో ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది అని తెలిపింది.

Also Read : Indra – Chiranjeevi : ‘ఇంద్ర’ రీ రిలీజ్‌కు మెగాస్టార్ ప్రమోషన్స్.. ఇంద్రసేనా రెడ్డి అంటూ..

నటుడు ఫైజల్ మాట్లాడుతూ.. నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి కొత్తవాళ్లకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాం. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజేష్ గారికి, నిర్మాత అల్లాబకాషు గారికి థ్యాంక్స్ అని అన్నారు. డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ.. కావేరి క్యారెక్టర్ బోల్డ్ గా, రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. మంచి సోషల్ మెసేజ్ తో ఈ సినిమాని చేసాము. ఆగస్టు 30న థియేటర్స్ లో చూడండి అని అన్నారు.

నిర్మాత షేక్ అల్లాబకాషు మాట్లాడుతూ.. ఇవాళ ఈవెంట్ కి వచ్చిన గెస్టులందరికి థ్యాంక్స్. మొదట డైరెక్టర్ సొంతంగా ఈ కావేరి సినిమాని మొదలుపెట్టాడు. కానీ ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి. ఆ సినిమా రష్ చూసి నాకు నచ్చి నిర్మాతగా మారాను. కావేరి సినిమాలో మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. తమపై దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశంతో ఈ సినిమాని తెరకెక్కించాం అని అన్నారు.

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ మాట్లాడుతూ.. కావేరి సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది. ఇవాళ ఆడపిల్లలు సర్వైవ్ కావాలంటే కష్టంగా ఉంది. వాళ్లు ఎలా పోరాడాలి అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఒకరకంగా ఇది లేడి ఓరియెంటెడ్ సినిమా. చాలా కష్టాలు దాటుకొని కావేరి సినిమా మీ ముందుకు వస్తుంది అని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు