KBC 13 : బిగ్‌బి కౌన్‌‌బనేగా కరోడ్‌పతికి వచ్చాడు.. చిక్కుల్లో పడ్డాడు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టుగా వ్యవహరించే కౌన్‌ బనేగా కరోడ్‌పతి 13 కంటెస్టెంట్ దేశ్ బంధు పాండే చిక్కులో పడ్డాడు. తన అభిమాన నటుడిని కలవాలనే ఉద్దేశంతో ఈ షోకు వచ్చాడు.

Kbc 13 Contestant Desh Bandhu Panday Lands Himself Into Legal Trouble

KBC 13 Contestant Desh Bandhu Panday : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టుగా వ్యవహరించే కౌన్‌ బనేగా కరోడ్‌పతి 13 కంటెస్టెంట్ దేశ్ బంధు పాండే చిక్కులో పడ్డాడు. తన అభిమాన నటుడిని కలవాలనే ఉద్దేశంతో ఈ షోకు వచ్చాడు. బిగ్ బి ముందు కూర్చొని షోలో పాల్గొన్నాడు. డబ్బులు బాగానే గెల్చుకున్నాడు. రూ. 6,40,000 ప్రశ్నకు తప్పుగా సమాధానం చెప్పి రూ. 3,40,000తోనే సరిపెట్టుకున్నాడు. బిగ్ బిని కలవాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అతను షోలో సమాధానం చెప్పనందుకు చిక్కుల్లో పడలేదు. షోలో పాల్గొనడం వల్ల చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. పాండే రైల్వే ప్రభుత్వ ఉద్యోగి.. KBC 13 షోలో పాల్గొన్నందుకు అతడికి రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ షీట్‌ పంపింది.

Pari Paswan : నాకు మత్తు ఇచ్చి పోర్న్ ఫిల్మ్ తీశారు.. మాజీ మిస్‌ యూనివర్స్‌ షాకింగ్ కామెంట్స్!

రైల్వే అధికారి దేశ్ బంధు ఈ బిగ్ బిషోలో పాల్గొనేందుకు ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13 వరకు ముంబైలోనే ఉండాల్సి వచ్చింది. రాజస్థాన్‌లోని కోటా నుంచి ముంబైలో షోలో పాల్గొనేందుకు వచ్చారు. ఇందుకోసం లీవ్ అప్లయ్ చేశాడు. కానీ, ఉన్నతాధికారులు ఆయన లీవ్ మంజూరు చేయలేదు. అయినప్పటికీ ఆయన వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక బిగ్ బి షోలో పాల్గొన్నాడు. KBC షోలో పాండే కనిపించడంతో రైల్వే అడ్మినిస్ట్రేషన్ అతడికి షార్జ్ షీట్ పంపింది. అనంతరం మౌనంగా ఉండిపోయారు ఉన్నతాధికారులు. రైల్వే ఉద్యోగుల సంస్థ దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.

అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. పశ్చిమ మధ్య రైల్వే మజ్దూర్ సంఘ్ డివిజనల్ సెక్రటరీ ఖలీద్, పాండేతో రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఎన్నడూ సరిగా వ్యవహరించలేదన్నారు. పాండే పాట్నాలో జన్మించాడు. అక్కడే పెరిగాడు. భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్ ఉద్యోగం రావడంతో గత 13 ఏళ్లుగా కోటాలో నివసిస్తున్నాడు. కరోనా సమయంలో ఈ ఏడాదిలో కూడా KBC షో స్టూడియోలో ప్రేక్షకులు పాల్గొన్నారు. షోలో ఛాన్స్ కొట్టేయాలంటే… అత్యంత వేగంగా పోటీ పడే మొదటి పోటీదారులు 3 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది . ఒక పోటీదారుడు సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తే.. బిగ్ బితో కలిసి మాట్లాడే ఛాన్స్ కొట్టేయొచ్చు..
Mukku Avinash : ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాష్